Abn logo
Apr 22 2021 @ 23:55PM

ప్రతి ఒక్కరికీ కొవిడ్‌ పరీక్షలు

ఇచ్ఛాపురం: వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్‌ సూరజ్

 సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ 

ఇచ్ఛాపురం: ప్రతిఒక్కరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని  సబ్‌కలెక్టర్‌ సూరజ్‌ ఘనేరే ధనుంజయ్‌ ఆదేశించారు. గురువారం ఇచ్ఛాపురం సీహెచ్‌సీని పరిశీలించారు. కొవిడ్‌ పాజటివ్‌కేసులుపెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కొవి డ్‌ సెంటర్‌ కోసం పాత ప్రసూతి కేంద్రాన్ని పరిశీలించారు.  కార్యక్రమంలో ఇన్‌చార్జి సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ పి.పాపినాయుడు, డాక్టర్‌ స్వాతి, డీటీ శ్రీహరి పాల్గొన్నారు. అలాగే ఇచ్ఛాపురంలో కొవిడ్‌ నిబంధ నలు పాటించి వ్యాపారాలు చేసుకోవాలని మునిసిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి కోరారు. గురువారం మునిసిపల్‌ కార్యాలయంలో వ్యాపారులలతో సమావేశం నిర్వహించారు. ఫసోంపేట: ప్రతిఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ వేయాలని డిప్యూటీ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ  సూచించారు.గురువారం సోంపేట సీహెచ్‌సీని  పరిశీలించారు. ఆయన వెంట డీటీ రాము, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఈ.లక్ష్మీనారాయణ, రాజేంద్రప్రసాద్‌ ఉన్నారు. సోంపేట, కంచిలి మండలాల్లో  కరోనా  టీకాల నిల్వలు పెంచాలని సమాచార హక్కు ప్రచారవేదిక అధ్యక్షుడు గోవిందరాజులు కోరారు. ఈమేరకు డీటీ కె.రాముకు  వినతిపత్రం సమర్పించారు. ఫపాలకొండ: పాలకొండలో నగర పంచాయతీ సిబ్బందితో కలిసి పట్టణంలో కమిషనర్‌  నడిపేన రామారావు గురువా రం  మాస్క్‌ డ్రైవ్‌ నిర్వహించా రు. మాస్క్‌ వేసుకోని వారికి అపరాద రుసుము విధించి కౌన్సెలింగ్‌ చేశారు. అనం తరం నగర పంచాయతీ కార్యాలయంలో ఎఫ్‌ఆర్‌ఎస్‌, శానిటేషన్‌ అటెండెన్స్‌ పరిశీలిం చారు. మాస్క్‌ ధరించడం వల్ల మహమ్మారి కరోనాను నియంత్రించవచ్చని డీఎస్పీ  శ్రావణి తెలిపారు. గురువారం పాలకొండ ఏలాం జంక్షన్‌లో మాస్క్‌ ఆవశ్యకతపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. మాస్క్‌లు లేకుండా ప్రయాణిస్తున్న వారిని ఆపి  అందజేశారు. ఆమెతోపాటు సీఐ జి.శంకరరావు, ఎస్‌.ప్రసాద్‌లు ఉన్నారు.ఫ  సరుబుజ్జిలి: కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ప్రత్యేకాధికారి  ఎన్‌.దామోదరరావు తెలిపారు.  గురువారం సరుబుజ్జిలి పీహెచ్‌సీలో  జరుగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు.  కార్యక్రమంలో  వైద్యాధికారి భవ్యశ్రీ పాల్గొన్నారు. ఫ కవిటి: కొవిడ్‌ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ జి.అప్పారావు హెచ్చరించారు. గురువారం కవిటి, జగతి, బెజ్జిపు ట్టుగ, బొరివంక, రాజపురంల్లో పర్యటించి ప్రజలకు  సూచనలు చేశారు. దుకాణాలు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే తెరవాలని తెలిపారు. ఫ ఆమదాలవలస: పట్టణంలో ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంట వరకే కిరాణ, కూరగాయల దుకాణాలు తెరిచి ఉంటాయని సీఐ బి.ప్రసాదరావు తెలి పారు. గురువారం స్థానిక మునిసి పల్‌ కార్యాలయంలో కిరాణ, కూరగాయల వర్తకు లతో కమిషనర్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జూనియర్‌ కళాశాల మైదానంలో కూరగాయల విక్రయించాలని తెలిపారు.  తహసీల్దార్‌ జి.శ్రీనివాసరావు, మేనేజర్‌ మురళీధర్‌ పట్నాయక్‌ పాల్గొన్నారు.

ఆర్టీసీ సిబ్బందికి పూర్తిస్థాయి వ్యాక్సిన్‌

గుజరాతీపేట: కరోనా సెకెండ్‌వేవ్‌ తీవ్రత దృష్ట్యా ఆర్టీసీ సిబ్బందికి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ వేయించాలని సంస్థ ఎండీ ఆర్‌పీ ఠాకూర్‌ అధికారులను ఆదేశించారు. గురువారం సంస్థ రీజనల్‌ మేనేజర్లు, వివిధ జోన్ల ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన వర్చువల్‌ సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రయాణికుల కోసం ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విశ్రాంత సిబ్బందికి ఎరియర్స్‌ చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

 టీకా కోసం క్యూ

ఆమదాలవలస:  ఆమదాలవలసలో కరోనా వ్యాక్సి న్‌ కోసం  క్యూలో గంటల తరబడి నిల్చొవలసి వచ్చింది. కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో మొదటివిడత  వ్యాక్సిన్‌ వేసిన వారికి  వైద్యశాఖ ఏర్పాట్లు చేసింది. దీంతో మూడురోజులుగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌, వారీయర్స్‌,సచివాలయ ఉద్యోగులకు వేస్తున్నారు. ఆమదాలవలస షాదీఖానా వద్ద వ్యాక్సిన్‌ వేసుకునేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో అక్కడ టెంట్లు లేకపోవడంతోపాటు తాగునీరు అందుబాటులో లేదు. దీంతో పలువురు  స్పీకర్‌ సీతారాంకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు టెంట్లు వేసి నీటి సౌకర్యం కల్పించారు.

 ప్రజలను అప్రమత్తం చేయండి

జి.సిగడాం: కరోనా మహమ్మారిపై ప్రజలను అప్రమత్తం చేయాలని  ఎంపీడీవో ఐ.రమణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్పంచ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో శానిటేషన్‌, క్లోరినేషన్‌ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ శ్రీనివాసులు, సూపరింటెం డెంట్‌ నాగమణి, రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.  


 


 

Advertisement