నెలాఖరులోపు కొవిడ్‌ లక్ష్యాలను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-12-02T06:18:15+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ లక్ష్యాలను త్వరితగతిన ఈనెలాఖరులోపు పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

నెలాఖరులోపు కొవిడ్‌ లక్ష్యాలను పూర్తి చేయాలి
వెబ్‌ కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్‌ రవి, అధికారులు

- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు

జగిత్యాల, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ లక్ష్యాలను త్వరితగతిన ఈనెలాఖరులోపు పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్‌, ఒ మిక్రాన్‌ వేరియంట్‌ తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాలో కలెక ్టర్లతో బుధవారం రాష్ట్ర కేబినెట్‌ సబ్‌ కమిటీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స మీక్ష సమావేశం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరి యంట్‌ వైరస్‌ వ్యాప్తి జరుగుతుందని, రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ పూర్తి చేయ డానికి, ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొవడానికి సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసారని తెలిపారు. డిసెంబరు చివరి నాటికి వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. రెండవ డోసు వ్యాక్సినే షన్‌ అంశంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 


అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి...

- రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌

కరోనా నేపథ్యంలో సామాజిక మాద్యమంలో పుకార్లు ప్రచారం కా కుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ ఆర్‌ ఆదేశించారు. యుద్ద ప్రాతిపాదికన వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని అ న్నారు. అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సామాజిక మాద్యామాల్లో యాక్టివ్‌గా ఉండాలన్నారు. ఒమిక్రాన్‌ గురించి వస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నారు. కరోనా చికిత్స కోసం అం దుబాటులో ఉన్న వైద్య సదుపాయాలకు సంబందించిన అంశాలతో ప్రతీ జిల్లాలో బులిటెన్‌ విడుదల చేసే విదంగా ప్రణాళిక రూపొందించుకోవా లని సూచించారు.


వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి

- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

గ్రామ స్థాయిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చే యాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వ్యాక్సినే షన్‌ తీసుకోని వారి వివరాలను సేకరించి సంబంధిత ప్రజాప్రతినిధులకు అధికారులు అందించాలన్నారు. ప్రజాప్రతినిధుల సమన్వయంతో లక్ష్యాల ను పూర్తి చేయాలన్నారు. విద్యా సంస్థల్లో ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు 95శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందన్నారు. విద్యాసంస్థల్లో రెండు రోజులు పాటు ప్రత్యేక వ్యాక్సినేషన్‌ క్యాంపు నిర్వహించి అర్హులందరికి వ్యాక్సినేషన్‌ అందించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పుప్పా ల శ్రీధర్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-02T06:18:15+05:30 IST