Abn logo
May 5 2021 @ 23:32PM

పలాస సీహెచ్‌సీలో కొవిడ్‌ సేవలు

పలాస: పలాస సీహెచ్‌సీలో బుధవారం నుంచి కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు. 15 బెడ్లకు ఆక్సిజన్‌ ఏర్పాటు చేశారు. మంత్రి డాక్టర్‌ అప్పలరాజు చొరవతో కలెక్టర్‌ నివాస్‌ పలాస సీహెచ్‌సీని కొవిడ్‌ ఆసుపత్రిగా తయారుచేసేందుకు అనుమతిచ్చారు. మొదటి అంతస్తులో ప్రత్యేక వార్డు కేటాయించి బాధితులను పరీక్షిస్తున్నారు. ప్రత్యేక సిబ్బంది తో పాటు అత్యవసరమైన మందులు, ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రమేష్‌ తెలిపారు.

 

Advertisement