జోనల్‌ కార్యాలయంలో కొవిడ్‌ నిబంధనలు పక్కాగా అమలు

ABN , First Publish Date - 2021-05-18T05:07:03+05:30 IST

కరోనా విజృంభిస్తుండడంతో గాజువాక జోనల్‌ కార్యాలయంలో కొవిడ్‌ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు.

జోనల్‌ కార్యాలయంలో కొవిడ్‌ నిబంధనలు పక్కాగా అమలు
సందర్శకులు లేక బోసిపోయిన జోనల్‌ కార్యాలయం

గాజువాక, మే 17: కరోనా విజృంభిస్తుండడంతో  గాజువాక జోనల్‌ కార్యాలయంలో కొవిడ్‌ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు. జోనల్‌ సిబ్బంది పలువురు కరోనా బారిన పడడం, కొందరు మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కార్యాలయంలోకి వచ్చే సిబ్బంది ప్రతి ఒక్కరు గ్లౌజులు, మాస్క్‌ ధరించేలా, శానిటైజర్‌తో చేతులు శుభ్రపరుచుకునేలా చర్యలు చేపట్టారు. పనుల నిమిత్తం వచ్చే ప్రజలను గేటు బయటే ఉంచి  వారి సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. పని వేళలు కూడా కుదించడంతో ప్రజలు కూడా పెద్దగా రాకపోవడం, పూర్తిస్థాయి సిబ్బంది రాకపోవడంతో ఎప్పుడూ జనాలతో సందడిగా కనిపించే జోనల్‌ కార్యాలయం బోసిపోతూ కనిపిస్తున్నది.


Updated Date - 2021-05-18T05:07:03+05:30 IST