హనుమకొండ: జిల్లాలో కోవిడ్ కలకలం రేపింది. భీమదేవరపల్లి మండలంలోని వంగరలో గల పీవీ రంగారావు తెలంగాణా రాష్ట్ర గురుకుల విద్యాలయంలో ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్న విద్యార్థులకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.