Abn logo
Apr 10 2020 @ 05:06AM

ఛాతి ఆస్పత్రిలో కోవిడ్‌ 19 రోగులకు ప్రత్యేక గదులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి):ఛాతి ఆస్పత్రిలో కోవిడ్‌-19 రోగుల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. వీటికి ‘నెగటివ్‌ ప్రెజర్‌ రూమ్స్‌’ అని పేరుపెట్టారు. కలెక్టర్‌ వినయచంద్‌ గురువారం వీటిని పరిశీలించి పలు సూచనలు చేశారు. నగరంలో కొవిడ్‌-19 రోగులకు చికిత్స అందిస్తున్న ఛాతి ఆస్పత్రిలో పరిస్థితులు బాగులేవంటూ ‘కరోనా లెక్కలపై దాగుడు మూతలు’  శీర్షికతో రెండు రోజుల క్రితం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది.


ఆస్పత్రిలో కోవిడ్‌-19 రోగులు, అనుమానితులను ఒకేచోట ఉంచి చికిత్స చేస్తున్నారని, కనీసం తెరలు కూడా లేవని అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ సత్యవతి చేసిన సూచనను కూడా యంత్రాంగం పట్టించుకోలేదని వివరించింది. ఈ కథనంపై వైద్యాధికారులు స్పందించి ఆఘమేఘాలపై 10 ప్రత్యేక గదులు ఏర్పాటుచేశారు. ఒక్కొక్కరినీ ఒక్కో గదిలో ఉంచాలని, వాటిలో మరుగుదొడ్లు, ఇతర పరికరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూపరింటెండెంట్‌కు సూచించారు. కలెక్టర్‌ వెంట ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌ ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement