Abn logo
May 27 2020 @ 04:11AM

కొవిడ్‌ ఆస్పత్రిగా జీజీహెచ్‌

గుజరాతీపేట: స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)ని కొవిడ్‌, నాన్‌ కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ 500 పడకల సామర్థ్యంతో కొవిడ్‌-19 ఆసుపత్రి రూపుదిద్దుకుంటోంది. నూతనంగా నిర్మించిన భవనాల్లో కొవిడ్‌ ఆసుపత్రిని నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఆసుపత్రికి వెళ్లేందుకు వేరేగా మరో మెయిన్‌ గేటును ఏర్పాటు చేస్తున్నారు.


  ఆరు కిలో వాట్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను కూడా నిర్మించి కొవిడ్‌ ఆస్పత్రికి అనుంధానించే పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని ఆర్‌ఎంవో డాక్టర్‌ హేమంత్‌ తెలిపారు. నాన్‌ కొవిడ్‌ ఆస్పత్రికి సంబంధించి జీజీహెచ్‌లో  కేవలం మాతా, శిశు, అత్యావసర వైద్య సేవలు మాత్రమే నిర్వహించనున్నారు. అలాగే, నగరంలోని శాంతి నర్సింగ్‌ హోం, గొలివి ఆస్పత్రులను కూడా త్వరలో కొవిడ్‌ ఆసుపత్రులుగా తీర్చిదిద్దనున్నారు. కాగా, ఇప్పటికే రాగోలు జెమ్స్‌లో కొవిడ్‌ రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement