పర్యాటక రంగం కుదేలు

ABN , First Publish Date - 2020-09-27T10:51:54+05:30 IST

కొవిడ్‌ ఎఫెక్ట్‌ అన్ని రంగాలపై పడింది. చారిత్రక విజ్ఞానాన్ని, అహ్లాదాన్ని అందించే పర్యాటక రంగం వెలవెలబోతోంది. కరోనా విస్తరణ నేపథ్యంలో పర్యాటక స్థలాలపై

పర్యాటక రంగం కుదేలు

- కొవిడ్‌తో తగ్గిన పర్యాటకుల సందడి

 - నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం


(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) 

కొవిడ్‌ ఎఫెక్ట్‌ అన్ని రంగాలపై పడింది. చారిత్రక విజ్ఞానాన్ని, అహ్లాదాన్ని అందించే పర్యాటక రంగం వెలవెలబోతోంది. కరోనా విస్తరణ నేపథ్యంలో పర్యాటక స్థలాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రస్తుతం కొన్ని పర్యాటక స్థలాలు తెరచుకున్నా ప్రజలు కూడా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ఆసక్తి చూపడం లేదు. ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం..


కార్మిక, ధార్మిక, పర్యాటక క్షేత్రంగా సిరిసిల్ల..

 కార్మిక, ధార్మిక కేంద్రంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది సిరిసిల్ల జిల్లా. ప్రాచీన సాంస్కృతిక కళా సంపద, చారిత్రక వారసత్వం, మానవ నాగరికతకు సంస్కృతికి అద్దం పడుతున్నాయి. ఎన్నో సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. కాలం నాటీ ఆంధ్రుల చరిత్ర, ఆనాటి పరిస్థితులను నేటికి మన కళ్లముందు నిలిపే ప్రాచీన కట్టడాలు మనల్ని ఆలోచనలోకి దింపుతోంది. జిల్లా వ్యాప్తంగా చరిత్ర ఒడిదుడుకులను ఎన్నింటినో ఎదుర్కొని నిలిచిన నిజాం కాలం నాటి కట్టడాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. భిన్న కులాలు, మతాలు, విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలతో వైవిధ్యానికి ప్రతీకగా జిల్లాలోని కట్టడాలు కనిపిస్తాయి. పర్యటక శాఖ, పురావస్తు శాఖ నిర్లక్ష్యంతో ఎన్నో కట్టడాలు ఆధరణ కోల్పోయి నిర్జీవంగా మారుతున్నాయి. జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో వేములవాడలోని శ్రీరాజారాజేశ్వర స్వామి దేవస్థానం, భీమేశ్వరాలయాలు చరిత్రకు అద్దం పడుతాయి. 27.5 టీఎంసీల సామర్థ్యంతో మానేరు వాగుపై శ్రీరాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ పర్యాటకులను అకర్షిస్తోంది. దీనికి అనుసంధానంగా అసియాలోనే అతిపెద్ద సర్జిపూల్‌ బావిని అనంతగిరి వద్ద నిర్మించారు. ఇక్కడే మరో అన్నపూర్ణప్రాజెక్ట్‌ నిర్మించారు. నిజాం కాలంలో నిర్మించిన ఎగువ మానేరు ప్రాజెక్ట్‌ ఉండగా, మల్కపేట వద్ద మరో రిజర్వాయర్‌ నిర్మాణంలో ఉంది. 


అందాల కోట కనుమరుగు..

ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామ సమీపంలో దాదాపు వెయ్యి అడుగుల గుట్టపైన ఐదు ప్రాకారాలతో అందాల కోట ఉంది. నిజాం కాలం కంటే ముందే ఆ కోట ప్రాభల్యం తగ్గిపోయింది. చాళుక్యుల పరిపాలన కాలంలో అనంతగిరి ఉండేంది. అప్పుడు ఎంతో వైభవంగా వెలుగొందినట్లుగా అక్కడ శిథిలమై కనిపిస్తున్న కట్టడాలే సాక్ష్యంగా నిలుస్తాయి. ఇప్పటి వరకు పురావస్తు శాఖ కనీసం తన రికార్డుల్లో కూడా నమోదుకు నోచుకోని అనంతగిరి కోట విశేషాలను ప్రజలకు తెలిసే విధంగా పరిశోధనలు జరుపాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2020-09-27T10:51:54+05:30 IST