కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను సిద్ధం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-04-10T05:38:29+05:30 IST

నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌లో కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను శనివారం వరకు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను సిద్ధం చేసుకోవాలి

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 9:  నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌లో కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను శనివారం వరకు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖల అధికారులతో మాట్లాడారు. మాక్లూర్‌లో వంద పడకలు, ఆర్మూర్‌, బోధన్‌లో 50 పడకల చొప్పున సిద్ధం చేసుకోవాలని సూచించారు. 24 గంటలు సిబ్బందికి విధులు కేటాయించాలని, అంబులెన్స్‌ను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. రోగులకు అత్యవసర సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డీవోలు సహకారం అందించాలన్నారు.  


Updated Date - 2021-04-10T05:38:29+05:30 IST