కొవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలపై దృష్టిసారించాం: ఆళ్ల నాని

ABN , First Publish Date - 2020-08-08T23:39:14+05:30 IST

కోవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలపై దృష్టిసారించామని మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. కొవిడ్ ఆస్పత్రుల్లో భోజనం, పారిశుద్ధ్యం, మందుల సరఫరాపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నామన్నారు.

కొవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలపై దృష్టిసారించాం: ఆళ్ల నాని

ఏలూరు: కోవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలపై దృష్టిసారించామని మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. కొవిడ్ ఆస్పత్రుల్లో భోజనం, పారిశుద్ధ్యం, మందుల సరఫరాపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నామన్నారు. మూడు రోజుల్లో అదనపు వైద్య సిబ్బంది నియామిస్తామని చెప్పారు. కొవిడ్ ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచనున్నామని, జూనియర్ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆళ్ల నాని హెచ్చరించారు.

Updated Date - 2020-08-08T23:39:14+05:30 IST