Flood: కౌలస్ నాలా ప్రాజెక్ట్‌కు పెరుగుతున్న వరద

ABN , First Publish Date - 2022-07-23T16:29:45+05:30 IST

జిల్లాలోని జుక్కల్ మండలం కౌలస్ నాలా ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది.

Flood: కౌలస్ నాలా ప్రాజెక్ట్‌కు పెరుగుతున్న వరద

కామారెడ్డి: జిల్లాలోని జుక్కల్ మండలం కౌలస్ నాలా ప్రాజెక్ట్‌(Koulus nala project)కు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 458 మీటర్లు కాగా ప్రస్తుతం 457.90మీటర్లకు చేరింది. అలాగే ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 1.237 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 1.225. టీఎంసీల నిల్వ కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌కు 26,794 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతుండగా... ఔట్ ఫ్లో 27,520 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ నీరు భారీగా వెళ్తుండడంతో జుక్కల్, బిచ్కుంద, పెద్ద కొడప్ గల్ మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

Updated Date - 2022-07-23T16:29:45+05:30 IST