కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు చేయవద్దు

ABN , First Publish Date - 2022-01-28T02:41:48+05:30 IST

కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు చేయమని రాష్ట్రప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నదని, అలా చేయకుండా ఉద్య

కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు చేయవద్దు
మాట్లాడుతున్న ఎన్‌జీవో కావలి డివిజన్‌ అధ్యక్షుడు శివకుమార్‌

-శివకుమార్‌

కావలి, జనవరి27: కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు చేయమని రాష్ట్రప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి  తెస్తున్నదని, అలా చేయకుండా ఉద్యమానికి  సహకరించా లని ట్రెజరీ ఉద్యోగులను  ఎన్‌జీవో అసోసియేషన్‌ కావలి డివిజన్‌ అధ్యక్షుడు శివకుమార్‌ కోరారు. పీఆర్సీ సాధన సమితి సభ్యులతో కలిసి గురువారం కావలి సబ్‌ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి కొత్త పీఆర్సీతో ఉద్యోగులకు జరిగే నష్టాన్ని వివరించి  బిల్లులు చేయకుండా కార్యాలయం మూసివేసి ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరారు. దానికి ట్రెజరీ ఉద్యోగులు కూడా అంగీకరించారు.అనంతరం శివకుమార్‌ మాట్లాడుతూ కొత్త పీఆర్సీ ప్రకారం ఒక్కొక్క ఉద్యోగికి రూ.2వేల నుంచి 10 వేల వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయన్నారు. దాన్ని అంగీకరించకుండా 10  రోజులుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు,, కాంట్రాక్ట్‌ ఉద్యోగసంఘాల నాయకులు తమ హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాడుతున్నారని చెప్పారు. పాత జీతాలే కావాలని ఐక్యంగా పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


Updated Date - 2022-01-28T02:41:48+05:30 IST