కొత్తపల్లిలో కానరాని పారిశుధ్యం

ABN , First Publish Date - 2022-06-03T03:41:23+05:30 IST

పచ్చటి పైరుగాలులతో ఆహ్లాదంగా ఉండాల్సిన పల్లెలు చెత్తకుప్పలు, మురుగునీటి నిల్వలతో కంపుకొడుతున్నాయి. కా

కొత్తపల్లిలో కానరాని పారిశుధ్యం
కొత్తపల్లిలో రోడ్డుపై పేరుకున్న చెత్త


తాగునీటిలో కలుస్తున్న మురుగునీరు

 రోడ్లపై చెత్త నిల్వలు

 పట్టించుకోని అధికారులు

కావలి రూరల్‌, జూన్‌ 2:వలి మండలంలోని కొత్తపల్లి హరిజన, అరుంధతీయవాడల్లో ఇళ్లలోని మురుగు నీరు వెళ్లేందుకు కాలువలు లేక కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు మొత్తం ఇళ్ల ముందే నిల్వ ఉంటూ దుర్గంధం వెదజల్లుతున్నది.  దీంతో దోమలు ప్రబలుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. కాగా కాలనీలకు నేరుగా పంపింగ్‌ ద్వారా తాగునీరు సరఫరా జరుగుతుండగా, ఇళ్లముందు నిల్వ ఉన్న మురుగునీటితో తాగునీరు కూడా కలుషితమవుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులు, పాలకుల దృష్టికి తీసుకువెళ్లినా, వారు పట్టించుకోవటం లేదన్నారు. ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయడంతోపాటు కాలనీలోని రోడ్లపై ఉన్న చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.




Updated Date - 2022-06-03T03:41:23+05:30 IST