Abn logo
Sep 25 2021 @ 00:31AM

అప్పన్నను దర్శించుకున్న సంగీత దర్శకుడు కోటి

ఆలయంలో సంగీత దర్శకుడు కోటి

సింహాచలం, సెప్టెంబరు 24: వరాహలక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం రాత్రి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి దర్శించుకున్నారు. ఆయనకు దేవాలయ పర్యవేక్షణాధికారి సిరిపురపు మహేశ్వరరావు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం అనంతరం  కోటి గోత్రనామాలతో అర్చకులు పూజలు చేశారు. గోదాదేవి అమ్మవారి దర్శనం తర్వాత పండితులు ఆశీర్వచనాలీయగా, అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.