భక్తితోటి కోటి సోమవారం

ABN , First Publish Date - 2020-11-22T06:14:43+05:30 IST

నెల్లూరులోని శివాలయాల్లో కోటి సోమవారం పర్వదినాన్ని శనివారం ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మూలస్థానేశ్వరాలయంలో మహా న్యాస పూర్వక రుద్రాభిషేకాలు, విశేష అభిషేకాలు, పూజలు జరిగాయి.

భక్తితోటి  కోటి సోమవారం

ముక్కంటికి విశేష పూజలు, అభిషేకాలు

నెల్లూరు(సాంస్కృతికం), నవంబరు 21 : నెల్లూరులోని శివాలయాల్లో కోటి సోమవారం పర్వదినాన్ని శనివారం ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మూలస్థానేశ్వరాలయంలో మహా న్యాస పూర్వక రుద్రాభిషేకాలు, విశేష అభిషేకాలు, పూజలు జరిగాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు బారులుతీరారు. 9గంటల తర్వాత సహస్రలింగేశ్వరస్వామికి పాలాభిషేకాలు జరిగాయి. మహారుద్రాయాగం నిర్వహించారు. సాయంత్రం మూలస్థానేశ్వరస్వామి, భుమనేశ్వరి  అమ్మవా రికి విశేష పూలంగిసేవ, ప్రాకారోత్సవం జరిగాయి. కార్తీక దీపోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి పూజలు చేశారు. శివనామస్మరణతో ఆలయం మారుమోగింది. ఈ ఉత్సవాల్ని ఆలయ చైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి, ధర్మకర్తలు, ఈవో వేణుగోపాల్‌ పర్యవేక్షించారు. 

ఫ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలోని సుందరేశ్వరస్వామికి ఉదయం పాలాభిషేకాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు జరిగాయి. సాయంత్రం పూలంగిసేవ, కుంభహారతులు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్‌ రత్నం జయరామ్‌, ధర్మకర్తలు,  ఈవో, సహాయ కమిషనర్‌ వెండిదండి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. 

ఫ మహాత్మాగాంధీనగర్‌ కృష్ణమందిరం, తల్పగిరి కాలనీ, ఉస్మాన్‌సాహెబ్‌పేట, క్రాంతినగర్‌, గుప్తాపార్కు తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో కోటి సోమవారం పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. 

========================

Updated Date - 2020-11-22T06:14:43+05:30 IST