Kotamreddy Sridhar Reddyకి గుండెపోటు

ABN , First Publish Date - 2022-05-27T23:43:59+05:30 IST

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy)కి గుండెపోటు వచ్చింది.

Kotamreddy Sridhar Reddyకి గుండెపోటు

నెల్లూరు: నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆమంచర్లలో చాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గుండెనొప్పి రావడంతో అపోలో వైద్యులు చికిత్స చేశారు. అయినా మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విషయం తెలిసిన వెంటనే ఆయన అపోలోకు చేరుకుని కోటంరెడ్డిని పరామర్శించారు. అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఫోన్‌లో ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2022-05-27T23:43:59+05:30 IST