మహేశ్ ఉంటే.. మిగిలిన వాళ్లు కనిపించడం కష్టమే: కోట (పార్ట్ 50)

హ్యాండ్సమ్‌ మహేశ్

మహేశ్‌బాబు పేరు గుర్తుకురాగానే ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. అందరూ మెచ్చుకునే లవబుల్‌ బోయ్‌ అతను. చూడ్డానికి చక్కగా, నీట్‌గా ఉంటాడు. కృష్ణగారి అబ్బాయిగా అతను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తెరమీద ఫైట్లూ అవీ చేసినా మనిషి పొడుగ్గా ఉంటాడు కాబట్టి అదో స్పెషల్‌గా అనిపిస్తుంటుంది. స్ర్కీన్‌మీద ఎంతమంది ఉన్నా అతనుంటే మిగిలిన వాళ్లు కనిపించడం కాస్త కష్టమే. అందగాడు కాబట్టి.. పిల్లలకి, ఆడవాళ్లకి, మగవారికి అనే తేడా లేకుండా అందరికీ నచ్చుతాడు. అతను నటించిన ‘పోకిరి’ సినిమాకి, ‘శ్రీమంతుడు’ సినిమాకి ఎక్కడైనా సంబంధం ఉంటుందా? రెండు సినిమాల్లోనూ తనదైన మార్కు నటన చూపించాడు. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ అయితే ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. అందుకే ఎన్టీఆర్, బన్ని, మహేష్.. ఈ ముగ్గురు నాకు చాలా బాగా ఇష్టం.

మిగిలిన వాళ్లలో అంత పొటన్షియాలిటీ ఉన్నట్టున్నా ఎక్కడా బయటికి వచ్చినట్టు నాకు అనిపించదు. ఏదో వస్తున్నారు.. చేస్తున్నారు.. కాదనట్లేదు. ఇప్పటికిప్పుడు పరిశ్రమలో హీరోలను లెక్కబెడితే ఎంత లేదన్నా 30, 40 మంది ఉన్నారండీ. కానీ చటుక్కున ఎవరి పేరు కూడా మనకి గుర్తుండదు. అందులోనూ ఇప్పుడేమో కాస్త ఫ్యాషన్‌ గోల ముదిరింది కదా... ప్రతి ఒక్కరూ గడ్డాలు, మీసాలు పెంచుకుని యాక్ట్‌ చేస్తుంటారు. గబుక్కున వారిని చూసి గుర్తుపట్టలేం. వయసు మీదపడి నేనూ కాస్త పెద్దవాడిని అయ్యాననుకోండి. ఇలా అంటున్నానని కాదండీ.. ఇవాళ ఉన్నటువంటి ఈ ఫ్యాషన్ గోల (గడ్డాల గోల) వల్ల ఎవరూ సరిగా ప్రేక్షకులకు రిజిస్టర్‌ కావడం లేదని నా అభిప్రాయం.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Advertisement

FilmSerialమరిన్ని...

Advertisement