Abn logo
Jul 10 2020 @ 23:51PM

తెలంగాణ ముఖ్యమంత్రిగా కోట శ్రీనివాసరావు

కోట శ్రీనివాసరావు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, ప్రతినాయకుడిగా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. రాజకీయ నేతగా నటించడం ఆయనకు కొత్తేమీ కాదు. తాజాగా చరణ్‌ రోరి దర్శకనిర్మాతగా తెరకెక్కిస్తున్న ‘రోరి’ చిత్రంలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు. ఆ పాత్రను ఆర్‌.రామన్న చౌదరిగా దర్శకుడు తీర్చిదిద్దాడు. ఇందులో కోట శ్రీనివాసరావు ఫస్ట్‌లుక్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ చిత్రానికి భీమ్స్‌ సంగీత దర్శకుడు.

Advertisement
Advertisement
Advertisement