2 లక్షల టికెట్లు... 250 కోట్లు... అమెరికాలో కొరియన్ బాయ్స్ దుమారం!

కొరియన్ పాప్ సంగీత సంచలనం ‘బీటీఎస్’ బ్యాండ్ మరోసారి రికార్డు సృష్టించింది. అయితే, ఈ సారి పాటలు, వాటికి వచ్చే వ్యూస్, బిల్‌బోర్డ్ ర్యాంకింగ్స్‌తో సెన్సేషన్ సృష్టించలేదు. కరోనా ఇంకా కలవరపెడుతూనే ఉన్నా తమ లాస్ ఏంజిల్స్ షోకు అమ్మిన టికెట్ల సంఖ్యతో దుమ్ము రేపింది. బీటీఎస్ బాయ్స్ అమెరికాలో వందల కోట్లు వసూలు చేశారు... 


బీటీఎస్ మ్యూజిక్ బ్యాండ్ పుట్టింది సౌత్ కొరియాలో అయినా అమెరికాలో దానికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బీటీఎస్ బాయ్స్‌గా పేరుబడ్డ కొరియన్ సింగర్స్‌కి ప్రపంచం మొత్తంతో పాటూ యూఎస్‌లోనూ చాలా మంది మ్యూజిక్ లవ్వర్స్ ఫిదా అయిపోయారు. అందుకే, తాజాగా లాస్‌ ఏంజిల్స్ నగరంలో జరిగిన నాలుగు రోజుల ‘పర్మిషన్ టూ డ్యాన్స్’ బీటీఎస్ మ్యూజిక్ కన్సర్ట్‌కి రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. మొత్తం 2 లక్షల 14 వేల టికెట్లు అమ్ముడుపోగా 33.3 మిలియన్ అమెరికన్ డాలర్లు వసూలయ్యాయి. అంటే, మన లెక్కల్లో 250 కోట్లుగా భావించవచ్చు! 


కరోనా లాక్‌డౌన్ కాలంలో అమెరికా వ్యాప్తంగా లైవ్ మ్యూజిక్ షోస్ నిర్వహించే కన్సర్ట్ వెన్యూస్, స్టేడియమ్స్ అన్నీ మూతపడ్డాయి. 2021 మొదట్లో మెల్లమెల్లగా అన్నీ తెరుచుకున్నాయి. అయితే, ప్రస్తుతం బీటీఎస్ రాబట్టినంతగా మరే మ్యూజిక్ షో డాలర్లను కొల్లగొట్టలేకపోయింది. వందల కోట్లు పెట్టి జనం టికెట్లు కొనటంతో మరోసారి పాప్ సంగీత ప్రపంచం జోష్‌లోకి వచ్చినట్లైంది... 

Advertisement