Abn logo
Mar 26 2020 @ 14:27PM

ఏపీ, తెలంగాణలకు రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన కొరటాల శివ

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తెలుగు రాష్ట్రాలు పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ పోరాటంలో తమ వంతు సాయం అందించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకూ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.


ఇప్పటికే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు, ప్రధానమంత్రి సహాయనిధికి రూ.2 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. అలాగే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇప్పటికే విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement
Advertisement