కూ v/s ట్విట్టర్‌

ABN , First Publish Date - 2021-02-13T05:41:21+05:30 IST

వివాదాల లిస్టులో మరో సోషల్‌ మీడియా చేరింది. ప్రైవసీ సెట్టింగ్స్‌ యాక్సెస్‌ తప్పనిసరి అంటూ ‘వాట్సప్‌’ ప్రకటన

కూ  v/s    ట్విట్టర్‌

వివాదాల లిస్టులో మరో సోషల్‌ మీడియా చేరింది.  ప్రైవసీ సెట్టింగ్స్‌ యాక్సెస్‌ తప్పనిసరి అంటూ ‘వాట్సప్‌’ ప్రకటన లేపిన గందరగోళం కనుమరుగు కాకముందే ‘ట్విట్టర్‌’ వివాదం ముందుకు వచ్చింది. మన దేశ చట్టాలను గౌరవించడం లేదంటూ భారత ప్రభుత్వం ట్విట్టర్‌కు గుడ్‌బై చెప్పి దేశీ ట్విట్టర్‌ ‘కూ’కు స్వాగతం పలికింది. దీంతో ఒక్కసారిగా ‘కూ’ వార్తల్లో నిలిచింది. కేంద్రంలోని అధికారులు సహా ప్రభుత్వ వ్యవస్థలు ‘కూ’ వైపు మారే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో  రెంటి మధ్య ఈ పది సారూప్యాలు వ్యత్యాసాలు చూద్దాం.



‘ట్విట్టర్‌’లో పరిమితి 280 కేరక్టర్లు మాత్రమే


‘ట్విట్టర్‌’లోనూ వీడియోలు, వెబ్‌ లింకులు తదితరాలు పెట్టవచ్చు.


పీపుల్‌ను ఫాలో కావచ్చు.


ఈమెయిల్‌ ఐడితో ట్విట్టర్‌లో ఖాతాను ఆరంభించవచ్చు.


రికార్డెడ్‌ వాటినే పోస్ట్‌ చేయాలి. 


గ్లోబల్‌ ఫాలోయింగ్‌ ఉంది. 


ప్రధానంగా ఇంగ్లీషే కమ్యూనికేషన్‌ మాధ్యమం


ప్రపంచంలోని పలు నేతలు, సెలబ్రిటీలు ‘ట్విట్టర్‌’ను ఉపయోగిస్తున్నారు.


సింబల్‌ బ్లూ బర్డ్‌ చాలా ఫేమస్‌.


ప్రపంచంలోని టాప్‌ మూడు సోషల్‌ మీడియాల్లో ఒకటి.



‘కూ’ 400 కేరక్టర్ల టెక్స్ట్‌కు అనుమతిస్తుంది. 


పిక్చర్లు, ఆడియోలు లేదా వీడియోలు, వబ్‌ లింకులు, యూట్యూబ్‌ లింకులను జతచేసే  అవకాశం కూ లో ఉంది. యూట్యూబ్‌ లింక్‌లను కూడా పోస్ట్‌ చేయవచ్చు. 


పీపుల్‌ను ఫాలో కావచ్చు. అయితే అదనంగా ‘ఎట్‌ ’ కంపోజ్‌ చేసి పీపుల్‌ను టాగ్‌ చేయవచ్చు. హాష్‌టాగ్‌ ద్వారానూ ఫాలో కావచ్చు.


వాలిడ్‌ మొబైల్‌ నంబర్‌ అవసరం. ఒటిపి ఆధారంగా ఫోన్‌ నంబర్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. 


ఆడియోలు, వీడియోలు రికార్డ్‌ చేసి ఇన్‌స్టాంట్‌గా పోస్ట్‌ చేయవచ్చు. పోస్ట్‌ పోల్‌కు కూడా అవకాశం ఉంది. 


ఓపీనియన్‌లను షేర్‌ చేసుకునేందుకు వీలు కల్పించే మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫారం. యాప్‌ డిస్క్రప్షన్‌ ప్రకారం చూస్తే ‘కూ’ ఆలోచనలు, చర్చలు ఇండియా పరిధికే పరిమితంలా కనిపిస్తున్నాయి. 


దేశీయ భాషలకు వేదికగా పనిచేస్తుంది. తెలుగు, హిందీ, మరాఠీ, కన్నడ తదితర స్థానిక భాషలకు వేదిక. త్వరలోనే ఇతర స్థానిక భాషలను కూడా చేర్చనున్నారు. 


ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.  కేంద్ర మంత్రులు, ఐఎఎస్‌ అధికారులు ఇప్పటికే ఇందులో చేరారు. ఇతర ఉన్నతాధికారులు సైతం చేరుతున్నారు.


రెండూ ఒకతీరుగానే పనిచేస్తాయి.. ‘కూ’ ‘వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’గా ప్రకటించుకుంది. అలాగే ఎల్లో బర్డ్‌తో ‘కూ’ ఐడెంటిఫై అవుతోంది. 


ఇప్పటికే దేశంలో టాప్‌ అయిదు సోషల్‌ మీడియా బ్లాగుల్లో ఒకటిగా పేరొందింది.


Updated Date - 2021-02-13T05:41:21+05:30 IST