Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొండవీడులో పిరమిడ్‌ ధ్యానం

చిల్డ్రన్స్‌ ఓపెన్‌ థియేటర్‌లో ధ్యానం చేస్తున్న జీకె ఫౌండర్‌ స్పిరిచ్యువల్‌ టాబ్లెట్‌ సభ్యులు

కొండవీడుకోట(యడ్లపాడు), అక్టోబరు 24 : మండలంలోని చారిత్రక కొండవీడుకోటను పిరమిడ్‌ స్పిరిట్యువల్‌ సొసైటీ సభ్యులు ఆదివారం సందర్శించారు. నరసరావుపేటకు చెందిన డాక్టర్‌ జీకే స్పిరిట్యువల్‌ టాబ్లెట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చిన సభ్యులు సామూహిక ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరవనంలోని చిల్డ్రన్స్‌ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌లో ఉదయం 6 గంటల నుంచి 7గంటల వరకు ఈ సామూహిక ధ్యాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ 


వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ గోపాలకృష్ణ కొండవీడుకోట అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ కల్లి శివారెడ్డి,  ఆవుల మురళీధరరెడ్డి దంపతులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement