వేమిరెడ్డి వద్ద కొండపి పంచాయితీ

ABN , First Publish Date - 2020-12-03T06:42:17+05:30 IST

కొండపి నియోజకవర్గం అధికార వైసీపీలో నెలకొన్న విబేధాల పర్వంపై పార్టీ జిల్లా పరిశీలకులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వద్ద పంచాయితీ ప్రారంభమైంది.

వేమిరెడ్డి వద్ద కొండపి పంచాయితీ


అసమ్మతి నేతలకే అవకాశం

నేరుగా వెంకయ్యపై ఫిర్యాదుల పర్వం

అదంతా గ్రూపు రాజకీయాల

ప్రభావమేనన్న వెంకయ్య

సీఎం దృష్టికి తీసుకెళ్తానని ప్రభాకర్‌రెడ్డి  భరోసా

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

కొండపి నియోజకవర్గం అధికార వైసీపీలో నెలకొన్న విబేధాల పర్వంపై పార్టీ జిల్లా పరిశీలకులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వద్ద పంచాయితీ ప్రారంభమైంది. ఇన్‌చార్జి డాక్టర్‌ వెంకయ్యపై అసమ్మతి బావుటా ఎగురవేసిన నేతలు దీనికి శ్రీకారం పలికారు. మండలాల వారీ గుర్తించిన అసమ్మతి నేతలను పిలిపించుకుని వారితో వెంకయ్య ముందే బహిరంగ పంచాయితీ పెట్టారు. అసమ్మతి నేతలు వెంకయ్య ముందే ఆయన పోకడపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయ గా, అవన్నీ కిందిస్థాయిలో గ్రూపు రాజకీయాల ప్రభావమేనంటూ ఆయన కొట్టిపారేశారు. వివరాల్లోకి వెళితే.. కొండపి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో దాదాపుగా అన్ని గ్రామాల్లో అధికార వైసీపీ నేతల మధ్య విబేధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో కొందరు నియోజకవర్గ ఇన్‌చార్జి, పీడీసీసీబీ చైర్మన్‌ వెంకయ్యను సమర్థిస్తుండగా, మరికొందరు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. తదనుగుణంగా అనేక పార్టీ కార్యక్రమాలు ఆయా మండలాల్లో గ్రూ పుల వారీ జరుగుతుండటమేగాక, కిందిస్థాయి నేతల మధ్య విబేధాలు బహిర్గతమయ్యాయి. చివరకు వెంకయ్య సమక్షంలో బహిరంగ దూషణలకు, ముష్టిఘాతకాలకు కూడా దిగుతున్నారు. ఒక దశలో వెంకయ్యపై కూడా దూషణలకు దిగారు. అంతేగాక జిల్లా మంత్రి బాలినేని, పరిశీలకుడు వేమిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలను కలిసి ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం సూచనతో నియోజకవర్గంలోని మండలాల వారీ కొందరు అసమ్మతి నేతలను గుర్తించారు. వారందర్నీ మంగళవారం సాయం త్రం తాడేపల్లిలో తన క్యాంప్‌ కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఒక్కో మండలం నుంచి ఏడుగురికిమించకుండా నేతలకు ఫోన్లు చేసి రమ్మన్నారు. వేమిరెడ్డి, ఇన్‌చార్జి వెంకయ్యను కూర్చోబెట్టుకుని అసమ్మతి నేతలతో భేటీ అయ్యా రు. పలు ఉదాహరణలతో వెంకయ్య పోకడ పార్టీకి నష్టపరుస్తుందని, ప్రత్యేకించి ఆది నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి ఇబ్బంది కలిగిస్తున్నారని వారు ఆరోపించారు. కారుమంచి గ్రామానికి చెందిన మద్యవిమోచన ప్రచారకమిటీ చైర్మన్‌ లక్ష్మణ్‌రెడ్డి అయితే తక్షణమే వెంకయ్యను ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నట్లు తెలిసింది. ఇలా అందరూ వెంకయ్యపై ఫిర్యాదులు చేశారు. కొం దరు నేతలు ఆరోపణలు చేస్తూ తమ ఆవేశాన్ని కూడా ప్రదర్శించారు. అయినా వేమిరెడ్డి ఎక్క డా వారిని కట్టడి చేసే ప్రయత్నం చేయక పోగా ఇదేమిటి వెంకయ్యా అంటూ ఇన్‌చార్జిని ప్రశ్నించినట్లు తెలిసింది. వాటి పై వెంకయ్య కూడా సూటిగా స్పందిస్తూ  గ్రామ, మండలస్థాయిలో పార్టీ నేతల మధ్య ఉన్న విబేధాలే ఈ ఫిర్యాదులకు కారణమని తమ వైపు నుంచి ఎ లాంటి లోపం లేదని చెప్పినట్లు సమాచారం. 3 గంటలపాటు అస మ్మతి నేతల ఫిర్యాదులను విన్న వేమిరెడ్డి వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. 

Updated Date - 2020-12-03T06:42:17+05:30 IST