కొండగట్టులోహన్‌మాన్‌ జయంతి ఉత్సవాలు రద్దు

ABN , First Publish Date - 2021-04-17T05:36:04+05:30 IST

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడడంతో జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి సన్నిధిలో ఈనెల 25 నుంచి 29 వరకు నిర్వహించే చిన్న హనుమాన్‌ జయంత్యుత్సవాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

కొండగట్టులోహన్‌మాన్‌ జయంతి ఉత్సవాలు రద్దు
ఆంజన్న ఆలయం

 మాలధారణ, విరమణలు ఉండవు

అంతరంగిక పూజలతో శ్రీరామ నవమి వేడుకలు 

మల్యాల, ఏప్రిల్‌ 16: రోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడడంతో జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి సన్నిధిలో ఈనెల 25 నుంచి 29 వరకు నిర్వహించే చిన్న హనుమాన్‌ జయంత్యుత్సవాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే దీక్షలు తీసుకున్న భక్తులు తమ ఇళ్లలో, సమీప ఆలయాల్లో విరమణ చేసుకోవాలన్నారు. కొండగట్టుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల నుంచి యేటా లక్షలాదిగా భక్తులు వస్తుంటారు. ప్రభుత్వ ఉత్తర్వులు, దేవాదాయశాఖ ఆదేశాల మేరకు చిన్న హనుమాన్‌ జయంత్యుత్సవాలను, ఈ నెల 21న జరిగే సీతారాముల కల్యాణం కూడా అంతరంగికంగానే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-04-17T05:36:04+05:30 IST