నేడు kondagattuలో హనుమాన్ జయంతి వేడుకలు..

ABN , First Publish Date - 2022-05-25T12:52:04+05:30 IST

నేడు ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. జయంతి సందర్భంగా కొండగట్టు క్షేత్రం భక్తులతో

నేడు kondagattuలో హనుమాన్ జయంతి వేడుకలు..

జగిత్యాల: నేడు ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. జయంతి సందర్భంగా కొండగట్టు క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి దర్శనానికి రద్దీ నెలకొంది. హనుమాన్ మాల ధరించిన స్వాములు ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున్న తరలివస్తున్నారు. దీంతో కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రం కాషాయంతో నిండిపోయింది. హనుమాన్ దీక్ష పట్టిన భక్తులు స్వామివారి దగ్గరికి కాలినడకన వస్తున్నారు. కొండగట్టు మొత్తం హనుమాన్ భక్తులతో కిక్కిరిసిపోయింది. జై హనుమాన్..జై శ్రీరామ్ అంటూ..భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు.

Updated Date - 2022-05-25T12:52:04+05:30 IST