కొండగట్టు ఘాట్‌రోడ్డుపై రాకపోకలు షురూ

ABN , First Publish Date - 2022-07-01T06:31:58+05:30 IST

కొండగట్టు ఘాట్‌రోడ్డుపై చిన్న వాహనాల రాకపోకలను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించారు.

కొండగట్టు ఘాట్‌రోడ్డుపై రాకపోకలు షురూ
రిబ్బన్‌ కట్‌చేస్తున్న మంత్రి

- ప్రారంభించిన మంత్రి కొప్పుల

మల్యాల, జూన్‌ 30: కొండగట్టు ఘాట్‌రోడ్డుపై చిన్న వాహనాల రాకపోకలను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించారు. కొండపైన గల వైజంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఈశ్వర్‌, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి రిబ్బన్‌ కట్‌ చేసి తమ వాహన శ్రేణితో కిందకు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాలుగేళ్లుగా వాహనాలు కిందకు వచ్చేందుకు అనుమతి లేకపోవడంతో భక్తులకు అసౌకర్యం కలుగడంతో పాటు వ్యాపారులు, స్థానికులు ఇబ్బందులు పడ్డారని దానికి తోడు కరోనా వేవ్‌తో జీవన ఆధారం చితికిపోయిందని అన్నారు. దీని పరిష్కారం ఆలస్యం అయినప్పటికీ సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో పలుమార్లు ఈఎన్‌సీని కలిసి మాట్లాడడంతో సమస్య పరిస్కారం అయి రాకపోకలు ప్రారంభం కావడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే రవిశంకర్‌ మాట్లాడుతూ ఘాట్‌రోడ్డు ప్రారంభానికి మంత్రి చేసిన కృషిని కొనియాడారు. మంత్రిని ఎమ్మెల్యేతో పాటు మండల ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. అంతకు ముందు ఘాట్‌రోడ్డు నుంచి స్టేజీ వరకు మహిళలు, వ్యాపారులు, స్థానికులు కోళాటాలతో మంత్రి, ఎమ్మెల్యేతో ర్యాలీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొండపల్కుల రామ్మోహన్‌రావు, స్థానిక సర్పంచ్‌ బద్దం తిరుపతిరెడ్డి, మల్యాల, కొడిమ్యాల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మిట్టపెల్లి సుదర్శన్‌, పి.కృష్ణరావు విండో చైర్మన్లు రాంలింగారెడ్డి, సాగర్‌రావు, మధుసూధన్‌రావు, రాజనర్సింగరావు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్‌ కొండగట్టు డైరెక్టర్లు కొంక నర్సయ్య, సురేంధర్‌, నాయకులు త్రినాథ్‌, పంజాల మల్లేశంగౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కోటేశ్వర్‌రావు, గుర్రం మల్లేశంగౌడ్‌, తోట అంజయ్య పాల్గొన్నారు


Updated Date - 2022-07-01T06:31:58+05:30 IST