Kondagattu Anjannaకు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

ABN , First Publish Date - 2021-11-11T12:19:00+05:30 IST

కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. గతంలో కోటి దాటిన ధాఖలాలు లేకపోగా కరోనా తీవ్రత తక్కువ నేపథ్యంలో ఇటీవల భక్తుల రాక పెరిగింది.

Kondagattu Anjannaకు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

 77రోజులకు గానూ రూ. 1.30 కోట్లు

కరీంనగర్/జగిత్యాల/మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. గతంలో కోటి దాటిన ధాఖలాలు లేకపోగా కరోనా తీవ్రత తక్కువ నేపథ్యంలో ఇటీవల భక్తుల రాక పెరిగింది. దీంతో హుండీల ఆదాయం కూడా పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అంజన్న సన్నిధిలో గల హుండీల ఆదాయాన్ని బుధవారం దేవస్థానం అధికారులు లెక్కింపు చేపట్టారు. ఈ లెక్కింపులో 77రోజులకు గానూ రూ. కోటి30లక్షల46వేల275నగదు సమకూరినట్లు ఈవో వెంకటేశ్‌ తెలిపారు. అలాగే 62 గ్రాముల మిశ్రమ బంగారం, ఐదు కిలోల 100గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు తెలిపారు. ఏఈవో బుద్ధి శ్రీనివాస్‌, పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, సునీల్‌ ఆలయ అధికారులు సిబ్బంది, శివశక్తి సేవా సమితికి చెందిన సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-11T12:19:00+05:30 IST