కొండపోచమ్మ హుండీ ఆదాయం రూ. 9,13,278

ABN , First Publish Date - 2022-01-29T04:39:11+05:30 IST

జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌ నర్సాపూర్‌లోని కొండపోచమ్మ ఆలయ హుండీని దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కించారు. రెండు నెలల హుండీ ఆదాయం 9,13,278 రూపాయలు వచ్చినట్టు దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ రంగారావు, ఆలయ ఈవో మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ రజితారమేష్‌, ఆలయ చైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. ఆలయ అభివృద్ధి కోసం ఈ ఆదాయాన్ని ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. జాతరకు వస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు.

కొండపోచమ్మ హుండీ ఆదాయం రూ. 9,13,278

జగదేవ్‌పూర్‌, జనవరి 28: జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌ నర్సాపూర్‌లోని కొండపోచమ్మ ఆలయ హుండీని దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కించారు. రెండు నెలల హుండీ ఆదాయం 9,13,278 రూపాయలు వచ్చినట్టు దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ రంగారావు, ఆలయ ఈవో మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ రజితారమేష్‌, ఆలయ చైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. ఆలయ అభివృద్ధి కోసం ఈ ఆదాయాన్ని ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. జాతరకు వస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది వెంకట్‌రెడ్డి, కనకయ్య, హరిబాబు, లక్ష్మణ్‌, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T04:39:11+05:30 IST