ఆదర్శప్రాయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ

ABN , First Publish Date - 2022-09-28T05:21:58+05:30 IST

అందరికీ ఆదర్శప్రాయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అన్నారు.

ఆదర్శప్రాయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకట్రావు

- జయంతి వేడుకల్లో కలెక్టర్‌ వెంకట్రావు

పాలమూరు/ మహబూబ్‌నగర్‌ టౌన్‌/ పాలమూరు యూనివర్సిటీ/ అడ్డాకుల/ బాదేపల్లి, సెప్టెంబరు 27 : అందరికీ ఆదర్శప్రాయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ మీటింగ్‌ హాలులో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బాపూజీ జయంతి నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్‌పర్సన్‌ ఎస్‌.స్వర్ణాసుధాకర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నరసింహులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, జిల్లా రైతుబంధు సమితి చైర్మన్‌ గోపాల్‌యాదవ్‌లతో కలిసి పాల్గొన్నారు. బాపూజీ 1915లో కొమరంభీం జిల్లా, వాంకిడిలో జన్మించి, 1940లో న్యాయవాద వృత్తి చేపట్టారని తెలిపారు. స్వాతంత్ర్యోద్యమం, నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్య మంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. బాపూజీపై వినిపించిన పలు కవితలు అందరినీ ఆకట్టుకున్నాయి. బీసీ శాఖ అధికారి ఆర్‌.ఇందిర, విఠల్‌, సతీష్‌, పాం డురంగం, వివేకానంద, నవీన్‌, లక్ష్మి, సౌజన్య ఏర్పాట్లు నిర్వహించారు.  

ఫ కొండాలక్ష్మణ్‌ బాపూజీ జయంతిని విద్యుత్‌ భవన్‌లో విద్యుత్‌ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డీఈటీ డి.చంద్రమౌళి, డీఈ శివరామకృష్ణ, ఎస్‌ఏఓ శ్రీకాంత్‌, ఏడీలు చంద్రశేఖర్‌, అనంతయ్య, జితేందర్‌, దినేష్‌కుమార్‌, గంగాధర్‌, జగన్‌, వెంకటనారాయణ, శ్రీనివాసులు, ముబిన్‌, శ్వేత, చంద్రకళ, విద్యుత్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. 

ఫ ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని జలసౌధలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌టీపీఏ హన్మం తు, డీఏవో వెంకటేశ్వర్లు, టీఎన్‌జీవోస్‌ కార్యదర్శి ఆర్‌.చంద్రానాయక్‌, నరేందర్‌రెడ్డి, ఆరిఫ్‌, నవీన్‌, గోవర్ధన్‌, శ్రీనివాసరెడ్డి, అమరేశ్వర, చంద్రకళ, లావణ్య, కార్తీక్‌, యాదయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు.  

కొండాలక్ష్మణ్‌ బాపూజీ జయంతిని పీయూలో ఘనంగా నిర్వహించారు. పరిపాలనా భవనంలో బాపూజీ చిత్రపటానికి యూనివర్సిటీ వైస్‌ చాన్‌లర్‌ ప్రొఫెసర్‌ ఎల్‌బీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గిరిజామంగతాయారు, పరీక్షల నియంత్రణాధికారి రాజ్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కిషోర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎం. కృష్ణయ్య, పీయూ స్టడీసర్కిల్‌ డైరెక్టర్‌ భూమయ్య, అధ్యాపకులు నాగం కుమారస్వామి పాల్గొన్నారు.

అడ్డాకులలో కొండాలక్ష్మణ్‌ చిత్రపటానికి ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి, జడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, మండల పరిషత్‌ అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కందూరు గ్రామ పంచాయతీలోనూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సర్పంచు శ్రీకాంత్‌, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

బాదేపల్లి పట్టణంలోని సిగ్నల్‌గడ్డలోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ పూలమాలు వేసి నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో నాయకులు రబ్బాని, బుక్క వెంకటేషం, అశోక్‌యాదవ్‌, కొళ్ళకృష్ణ, కరాటేశ్రీను, లింగంపేటశేఖర్‌, రాఘవేందర్‌, రమేష్‌ పాల్గొన్నారు. 

కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎడ్ల బాలవర్ధన్‌గౌడ్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

బీసీ సేన ఆధ్వర్యంలో  కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసినివాళులు అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ యాదవ్‌, నాయకులు నడిమింటి శ్రీనివాసులు, నిరంజన్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-09-28T05:21:58+05:30 IST