తెలంగాణ సమాజానికి గర్వకారణం కొండా లక్ష్మణ్‌ బాపూజీ

ABN , First Publish Date - 2022-09-28T03:44:37+05:30 IST

తెలంగాణ సమాజానికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ గర్వ కారణమని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన కొండాలక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

తెలంగాణ సమాజానికి గర్వకారణం కొండా లక్ష్మణ్‌ బాపూజీ
ఆసిఫాబాద్‌లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న అధికారులు, నాయకులు

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 27: తెలంగాణ సమాజానికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ గర్వ కారణమని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.  జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన కొండాలక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్‌ బాజ్‌పాయి, ఎమ్మెల్యే ఆత్రం సక్కులతో కలిసి కలెక్టర్‌ కొండాలక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ  1915లో వాంకిడి మండలంలో జన్మించిన బాపూజీ పదో తరగతి వరకు ఆసిఫాబాద్‌లో చదివారని చెప్పారు. అనంతరం హైదరాబాద్‌లో న్యాయ విద్యను పూర్తి చేశావరరని అన్నారు. నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి బాపూజీ అని కొనియాడారు.  కార్యక్రమంలో డీఆర్వో సురేష్‌, డీపీఓ రమేష్‌, జిల్లా బీసీ సంక్షేమాధికారి సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ మల్లికార్జున్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, నాయకులు అశోక్‌, రమేశ్‌, శంకర్‌, మంగ తదితరులు పాల్గొన్నారు. 

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌లోని పలు కార్యాలయాలు, విద్యా సంస్థల్లో పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఆయా కార్యాలయాలు, పలు చోట్ల కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పద్మశాలీ సంఘం ప్రతినిధులు ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రిన్సిపాల్‌ లక్ష్మీ నరసింహం, ఎన్‌ఎస్‌ఎస్‌ సిబ్బంది, పద్మశాలీ సంఘం ప్రతినిధులు రాజమౌళి, కేదారి, నల్ల కనకయ్య, సిందం చంద్రయ్య, సురవర్ధన్‌, కొంగ సత్యనారాయణ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

వాంకిడి: మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ  జయంతి వేడుకలను మంగళవారం  ఘనంగా నిర్వహించారు. స్థానిక గ్రీన్‌వుడ్‌ పాఠశాలలో లక్ష్మణ్‌ సేవాసదన్‌, హనుమాన్‌ మందీర్‌ వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో,  ఎంపీడీవో  కార్యాలయం, ప్రభుత్వ జూనియర్‌ క ళాశాలలో వేర్వేరుగా  కొండా లక్ష్మణ్‌ బాపూజీ  చిత్రపటాలకు ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు.   ఆయా  కార్యక్రమాల్లో జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ పెంటు, లక్ష్మణ్‌సేవాసదన్‌ చైర్మన్‌ గాదే అవినాష్‌, సంస్థ సభ్యులు అశోక్‌, దౌలత్‌,  రోహిదాస్‌, అంబెడ్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు జైరాం, కశాళాల ప్రిన్సిపాల్‌ సంపత్‌కుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ పీఓ చంద్రయ్య, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సుచిత్‌, ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జైరాం, పద్మశాలి సంఘం మహిళా  నాయకులు సరస్వతి, వనిత, అరుణ తదితరులు పాల్గొన్నారు. 

పెంచికలపేట: మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో  టీఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్సై రామన్‌కుమార్‌ పూల మాల వేసి నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో నాయకులు తిరుపతి, సర్పంచ్‌ శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, రమేష్‌, బాబు, శ్రీనివాస్‌, సదాశివ్‌, రాజేష్‌, ముంతాజ్‌, కృష్ణ, సకారాం తదితరులు పాల్గొన్నారు. 

బెజ్జూరు: మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు.  కార్యక్ర మంలో తిరుపతి, వెంకటేష్‌, బాలాజీ, వెంకటేష్‌, శంకర్‌, గణేశ్‌, రమేశ్‌, శ్రీవర్ధన్‌, నరేందర్‌గౌడ్‌, మహేష్‌, వెంకటేష్‌, భద్రయ్య పాల్గొన్నారు. 

దహెగాం: మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో కొండా లక్ష్మణ్‌బాపూజీ చిత్రపటానికి తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు పూల మాల వేసి నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో ఎంఆర్‌ఐ నాందేవ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T03:44:37+05:30 IST