Abn logo
Sep 22 2021 @ 01:32AM

కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలను సాధించాలి

భూదానపోచంపల్లిలోని లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న చేనేత కార్మిక సంఘం అధ్యక్షురాలు శశికళ, పాలకవర్గ సభ్యులు

తెలంగాణ ఉద్యమనేత, స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని జిల్లా వ్యాప్తంగా మంగళవారం  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పలువురు నివాళులర్పిం చారు. రాషా్ట్రనికి ఆయన చేసిన సేవలను నాయకులు కొనియడారు. 

భూదానపోచంపల్లి, సెప్టెంబరు 21:   సమాజ సంక్షేమానికి కృషి చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలను సాధించాలని  ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ ఫౌండేషన భూదానపోచంపల్లి అధ్యక్షుడు బడుగు దానయ్య అన్నారు. లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి సందర్భంగా భూదానపోచంపల్లిలో లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. తెలం గాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలి తెలంగాణ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న మహనీయుడని కొనియాడారు. ఈనెల 27న  లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని నిర్వహించాలని కోరారు.  టీఆర్‌ఎస్‌ పట్టణ కమిటీ అధ్యక్షుడు సీత లక్ష్మణ్‌, చేనేత కార్మిక సంఘం అధ్యక్షురాలు మెరుగు శశికళ ఆధ్వర్యంలో వేర్వేరుగా లక్ష్మణ్‌బాపూజీ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్ర మాల్లో కర్నాటి ధనుంజయ్య, గర్దాసు బాలయ్య, రాపోలు జ్ఞానేశ్వర్‌, తడక యాదగిరి, కర్నాటి పాండు, ఏలె భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. 

మోత్కూరు: పట్టణంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాశికంటి లక్ష్మీనర్సయ్య పూలమాల వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో  పోచం కన్నయ్య,  జెల్ది రాము లు, మహేశ్వరం వెంకన్న, పాల్గొన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. కార్యక్రమంలో రామచంద్రు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

 రాజాపేట/యాదాద్రి రూరల్‌/భూదాన పోచంపల్లి/చౌటుప్పల్‌ టౌన/సంస్థాన నారాయణపురం: రాజాపేట మండలం రఘునాథపూర్‌, యాదగిరిగుట్ట, భూదానపోచంపల్లి మండలాల్లో లక్ష్మణ్‌ బాపూజీ చిత్రప టాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు, మడుగు మల్లేశం, భారత పురు షోత్తం,డాక్టర్‌ సీత సత్యనారాయణ, సూరపల్లి శివాజీ, సింగం కృష్ణ, వంగరి రఘు, సూరపల్లి వెంకటేశం, కిశోర్‌, కృష్ణదాసు, సత్యనారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

లక్ష్మణ్‌ బాపూజీ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలి

 చౌటుప్పల్‌ టౌన: కొండా లక్ష్మణ్‌ బాపూజీ పోరాట పటిమను యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు. చౌటుప్పల్‌లో  కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే రాజగోపా ల్‌ రెడ్డి, మునిసిపల్‌ చైర్మన వెనరెడ్డి రాజు, ఏంఎసీ చైర్మన బొడ్డు శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు.