కోనసీమకు అంబేడ్కర్‌ జిల్లాగా పేరు పెట్టాలి

ABN , First Publish Date - 2022-01-29T04:36:39+05:30 IST

కొత్తగా ఏర్పాటు కానున్న కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని కోనసీమకు చెందిన దళిత సంఘాల ప్రతినిధులు శుక్రవారం కామనగరువులోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ను కలిసి వినతిపత్రం అంద జేశారు.

కోనసీమకు అంబేడ్కర్‌ జిల్లాగా పేరు పెట్టాలి

 పలు సంఘాల నాయకుల వినతి

అమలాపురంరూరల్‌, జనవరి 28: కొత్తగా ఏర్పాటు కానున్న కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌  అంబేడ్కర్‌ పేరు పెట్టాలని కోనసీమకు చెందిన దళిత  సంఘాల ప్రతినిధులు శుక్రవారం కామనగరువులోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ను కలిసి వినతిపత్రం అంద జేశారు. కొత్తగా ప్రకటించిన జిల్లాలకు పలువురు ప్రము ఖుల పేర్లను ప్రకటించినప్పటికీ ఏ ఒక్క జిల్లాకు దళిత మహనీయుల పేరు పెట్టకపోవడం శోచనీయమని ఆవేద న వ్యక్తం చేశారు. వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా దళి తులు ఉన్నారని మంత్రికి వివరించారు. అంబేడ్కర్‌ జిల్లా గా నామకరణం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి దళితుల విన్నపాన్ని తీసుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దళిత నాయకులు డీబీ లోక్‌, జంగా బాబూరావు, ఎంఏకే భీమారావు, ఇసుకపట్ల రఘుబాబు, మెండు  రమేష్‌బాబు, ఉండ్రు  బాబ్జి, సరెళ్ల విజయప్రసాద్‌, గెడ్డం సురేష్‌బాబు, మద్దా చంటిబాబు, పందికి శ్రీహరి, పినిపే రాధాకృష్ణ, గన్నవరపు శ్రీను, గెడ్డం సంపదరావు, కోట రామ్మోహన రావు, తదితరులు పాల్గొన్నారు. 

విజ్ఞాపన దీక్షను విజయవంతం చేయండి 

 కోనసీమ దళిత ఐక్యవేదిక పిలుపు

ఉప్పలగుప్తం: కోనసీమ ప్రాంతాన్ని అంబేడ్కర్‌ పేరుతో జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఈనెల 30న అమలాపురంలో నిర్వహించనున్న విజ్ఞాపన దీక్షను విజయవంతం చేయాలని కోనసీమ దళిత ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి ఇసుకపట్ల రఘుబాబు అధ్యక్షతన చల్లపల్లిలో శుక్రవారం సమావేశం జరిగింది. అంబేడ్కర్‌ జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రిని కలిసి ప్రజల అభిప్రాయాన్ని వివరించాలని మంత్రి విశ్వరూప్‌, ఎంపీ చింతా అనూరాధలను కలిసి విన్నవించినట్టు నా యకులు తెలిపారు. సమావేశంలో పెయ్యల విష్ణుమూర్తి, పినిపే జయరాజ్‌, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, యాళ్ళ లక్ష్మీనారాయణ, పెయ్యల రాజ్‌కుమార్‌, కుంచే చిన్నా, ఊటాల రామాంజనేయులు పాల్గొన్నారు.

మలికిపురం: కోనసీమకు అంబేడ్కర్‌ జిల్లాగా పేరు పె ట్టాలని శుక్రవారం మలికిపురంలో వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కోనసీమలో మూడు ఎస్సీ నియోజకవర్గాలతోపాటు అత్యధికంగా ఎస్సీ సామా జికవర్గ ప్రజలు ఉన్నందున జిల్లాకు అంబేడ్కర్‌ జిల్లాగా పేరుపెట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గెడ్డం తులసీభాస్కర్‌, గెడ్డం సింహ, నల్లి శివ, దేవ రాజేంద్రప్ర సాద్‌, గెడ్డం ఫిలిప్‌రాజు పాల్గొన్నారు. 

ముమ్మిడివరం: అంబేడ్కర్‌ ఆశాభావాలకు అనుగుణంగా కోనసీమకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జిల్లాగా నామకరణం చేయాలని హితకారిణి సమాజం చైర్మన్‌ కాశి బాలమునికుమారి విజ్ఞప్తి చేశారు. అమలాపురం పార్లమెంటు ప్రాంతానికి డాక్టర్‌ అంబేద్కర్‌ జిల్లాగా పేరుపెట్టాలని కోనసీమ అంబేడ్కర్‌వాదులంతా కోరుకుంటున్నారన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులంతా సీఎం జగన్మోహనరెడ్డికి  విన్నవించి కోనసీమకు అంబేద్కర్‌ జిల్లాగా పేరుపెట్టేందు కు కృషిచేయాలని ఆమె కోరారు. 

అంబాజీపేట: కొత్తగా ఏర్పడే కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరుగా నామకరణం చేయాలని అంబా జీపేట షెడ్యూలు కులాల సంక్షేమ సంఘం సభ్యులు తహశీల్దార్‌ ఎల్‌.జోసెఫ్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వరరావు, పి.వెంకట్రావులు ఉన్నారు. 

తాళ్లరేవును కోనసీమలో కలపొద్దు

తాళ్లరేవు, జనవరి 28: తాళ్లరేవు మండలాన్ని కోనసీమ జిల్లాలో కలపొద్దని కాకినాడలో కలపాలని ముమ్మిడివరం నియోజకవర్గం టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడు ధూళిపూడి వెంకటరమణ శుక్రవారం డిమాండ్‌ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాల పునర్‌ విభజనలో భాగంగా తాళ్లరేవును కోనసీమలో కలపడంవల్ల ప్రజలకు ప్రయాణభారం పడుతుందన్నారు.  

‘కోనసీమ జిల్లాకు కళా వెంకట్రావు పేరుపెట్టాలి’

కొత్తపేట, జనవరి 28: కోనసీమ జిల్లాకు కోనసీమ రూ పశిల్పి, స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావు పేరు పెట్టాలని వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.  ఈ అంశా న్ని పరిశీలించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

కొత్తపేటకు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుచేయాలి

కొత్తపేట, జనవరి 28: కోనసీమ జిల్లాలో కొత్తపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేయాలని టీడీపీ అమలాపురం పార్లమెంటు అధికార ప్రతినిధి ముత్యాల బాబ్జీ కోరారు. బ్రిటిష్‌ కాలంలోనే కొత్తపేటలో ఫిరక్కా, ఠాణా ఏర్పా టయ్యాయన్నారు. స్వాతంత్య్రం అనంతరం కొత్తపేట తాలూకా కేంద్రంగా, నియోజకవర్గ కేంద్రంగా ఉందన్నారు. ప్రధాన కార్యాలయాలు కలిగిన కొత్తపేటలో కొత్తగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తి ంచి చర్యలు చేపట్టాలని బాబ్జీ కోరారు.

కాజులూరును కాకినాడలో కలపాలి

కాజులూరు, జనవరి 28:  ప్రస్తుతం కోనసీమ జిల్లా జాబితాలో ఉన్న కాజులూరు మండలాన్ని కాకినాడ జిల్లా లో కలపాలన్న డిమాండ్‌ మండల నాయకులు, ప్రజల నుంచి వినిపిస్తోంది. అమలాపురానికి కాజులూరు మండలం సుమారు 70కిలోమీటర్ల దూరంలో ఉన్నం దున 20 కిలోమీటర్లలోపు ఉండే కాకినాడ జిల్లాలో కల పాలని కోరేందుకు స్ధానిక నాయకులు, ప్రజలు సమాయత్తమవుతున్నారు. 

‘మండపేటను రాజమహేంద్రవరంలో కలపాలి’

మండపేట, జనవరి 28: ప్రస్తుతం అమలాపురం పార్లమెంటులో వున్న మండపేట అసెంబ్లీ నియెజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలని శుక్రవారం ఏపీజేడబ్ల్యుఎఫ్‌ రామచంద్రపురం డివిజన్‌ అధ్యక్షు డు రెడ్డి ఓమెష్‌. నియోజకవర్గ అధ్యక్షుడు వి.నూకరాజు సారధ్యంలో మునిసిపల్‌ కార్యాలయం వద్ద పాత్రికేయులు రిలే నిరాహాక దీక్షలు చేపట్టారు. శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడు తూ మండపేటను రాజమహేంద్రవరంలో కలపాలని తాను అసెంబ్లీలో కూడా డిమాండ్‌ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అఖిలపక్షం ఆద్వర్యంలో ఉద్యమం చేపట్టాలని కూడా నిర్ణయించామని ఆయన వెల్లడించారు. మండపేట ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వం మండపేటను అమలాపురంనుంచి ‘అమలాపురం వద్దు.... రాజ మ హేంద్రవరమే ముద్దు’ అనే నినాదంతో చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించి ఉత్తరాల ను కలెక్టర్‌కు పోస్టు చేశారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ స్థానికుల అకాంక్షను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి కోన సత్యనారాయణ, కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కామన ప్రభాకరరావు, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి దూళి జయరాజు, కుల సంఘాల నాయకులు, మత పెద్దలు పాత్రికేయుల దీక్షలకు సంఘీ భావం ప్రకటించారు. మునిసి పల్‌ మాజీ చైర్మన్‌ చుండ్రు శ్రీవరప్రకాష్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు, ఉపాధ్యక్షుడు గడి రాంబాబు, వైసీపీనేతలు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. సాయంత్రం దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు

ఆలమూరును తూర్పుగోదావరిలో కలపాలి 

ఆలమూరు, జనవరి 27: ఆలమూరు మండలాన్ని కోనసీమ జిల్లాలో చేర్చడం తమకు ఆమోదయోగ్యం కాద ని అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావే శంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌లో కొనసాగుతున్న ఆల మూరును అదే జిల్లాలో ఉంచాలని డిమాండ్‌ చేశారు. విద్య, ఉద్యోగ తదితర అంశాల్లో తమకు రాజమహేం ద్రవరంతోనే ఎక్కువగా అనుబంధం ఉందన్నారు. సమావేశంలో వైసీపీ, టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-29T04:36:39+05:30 IST