అంబేద్కర్‌ పేరు కొనసాగించాల్సిందే !

ABN , First Publish Date - 2022-05-26T03:46:27+05:30 IST

కోనసీమ జిల్లాను అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం

అంబేద్కర్‌ పేరు కొనసాగించాల్సిందే !
కందుకూరులో నిరసన తెలుపుతున్న ప్రజాసంఘాల నాయకులు

కందుకూరు, మే 25:  కోనసీమ జిల్లాను అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కందుకూరులోని అంబేద్కర్‌ విగ్రహం సెంటర్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ  బీఆర్‌ అం బేద్కర్‌ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడం గర్వకారణమని అన్నారు. అంబేద్కర్‌ ఘనత తెలియని కులోన్మాదులు కొంతమంది కుట్రలు చేసి అంబేద్కర్‌ పేరును తొలగించమంటే దళిత బహుజన వర్గాల ప్రజలు చూస్తూ కూర్చోవటం జరగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పాలేటి కోటేశ్వరరావు, ముప్పవరపు కిషోర్‌, కళ్లగుంట మోహనరావు, కత్తి ఐజక్‌, గేరా చిరంజీవి, కసుకుర్తి మాల్యాద్రి, రేణమాల అయ్యన్న, గాండ్ల హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-26T03:46:27+05:30 IST