AP News: బురదల్లోనే చదవులు... తల్లిదండ్రులు, టీచర్ల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-07-21T16:03:45+05:30 IST

వరద ముంపు ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. వరద ఉధృతి తగ్గినప్పటినప్పటికీ అనేక గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి.

AP News: బురదల్లోనే చదవులు... తల్లిదండ్రులు, టీచర్ల ఆగ్రహం

కోనసీమ: వరద ముంపు ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. వరద ఉధృతి తగ్గినప్పటినప్పటికీ అనేక గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. అటు చదువులు కూడా బురదల్లోనే జరుగుతున్నాయి. జనం వరద కష్టాల్లో ఉంటే విద్యార్థులు పాఠశాలలకు రావాలాని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అన్ని పాఠశాలలు ఎక్కడికక్కడ బురద మెటల మయంగా ఉన్నాయి. ఎక్కడా బురదను తొలగించకుండా అధికారులు పాఠశాలలను తెరిచారు. పాఠశాలకు వెళ్లే క్రమంలో  పిల్లలు బురదలో జారి పడిపోతున్నారు. ఓ పక్క విషసర్పాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రమాదాలు పొంచి ఉన్నా పాఠశాలలు తెరవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. 

Updated Date - 2022-07-21T16:03:45+05:30 IST