ఆరు నెలల్లో మరో జిల్లా పేరు మార్చబోతున్నారా?

ABN , First Publish Date - 2022-05-26T02:00:57+05:30 IST

కోనసీమ జిల్లాను కొనసాగించాలంటూ అమలాపురంలో జేఏసీ నేతలు, యువకులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే...

ఆరు నెలల్లో మరో జిల్లా పేరు మార్చబోతున్నారా?

అమలాపురం: కోనసీమ జిల్లాను కొనసాగించాలంటూ అమలాపురంలో జేఏసీ నేతలు, యువకులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నెల 18న ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా జిల్లా పేరును అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చుతూ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ఒక వర్గం సంబరాలు చేసుకోగా, మరో సామాజికవర్గం ఆందోళనలకు దిగింది. కోనసీమ జిల్లాగా మాత్రమే పేరు కొనసాగించాలంటూ ఉద్యమానికి సిద్ధమైంది.


అదే సమయంలో ఈ నెల 19న తెల్లవారుజామున అయినవిల్లి మండలం శానపల్లి లంకగ్రామంలో స్థానిక ప్రజలు, కొందరు వైసీపీ నేతలు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేసి శవయాత్ర నిర్వహించడం కలకలం రేపింది. 20వ తేదీన కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ జేఏసీ నేతలు అమలాపురం (Amalapuram) కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపిస్తే 5 వేల మంది వరకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్యం సాయి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజానికి సాయి వైసీపీ క్రియాశీల కార్యకర్త. మంత్రి విశ్వరూ్‌పకు అనుచరుడు కూడా. ఆయనకు మంత్రి పదవి వచ్చినప్పుడు అభినందనలు తెలియజేస్తూ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాడు. అంబేడ్కర్‌ (Ambedkar) పేరు మార్చాలన్న ఉద్యమంలో ఇతడు కీలక పాత్ర పోషించడం వైసీపీ నేతల పాత్రపై అనుమానాలు కలిగిస్తోంది.


ఈ నేపథ్యంలో ‘‘కోనసీమ విధ్వంసానికి సూత్రధారులెవరు?. అంబేద్కర్‌పై జగన్ ప్రభుత్వానిది కపట ప్రేమ కాదా?. ప్రతిపక్షాలను బద్నాం చేయడానికే కుట్ర జరిగిందా?. వైసీపీ నేల హస్తం ఉందనే ఆధారాలపై సజ్జల సమాధానమేంటి?. విధ్వంసాలతోనే మళ్లీ ఎన్నికల్లో గెలవాలనేదే వైసీపీ వ్యూహమా?. కోనసీమ ఏరియాలలో ఎంతమంది రౌడీషీటర్లున్నారు?. రౌడీలు, వైసీపీ నేతలతో కలిసి విధ్వంసం సృష్టించారా?. కోనసీమ అల్లర్లను రాష్ట్ర వ్యాప్తం చేసే కుట్ర జరుగుతోందా?. ఆరు నెలల్లో మరో జిల్లా పేరు మార్చబోతున్నారా?. కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక కుతంత్రం ఉందా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2022-05-26T02:00:57+05:30 IST