Konaseema: లంక గ్రామాలను చుట్టుముడుతున్న వరద నీరు

ABN , First Publish Date - 2022-07-13T16:43:30+05:30 IST

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పి.గన్నవరం నియోజకవర్గంలో లంక గ్రామాలను వరద నీరు చుట్టుముడుతోంది.

Konaseema: లంక గ్రామాలను చుట్టుముడుతున్న వరద నీరు

కోనసీమ: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పి.గన్నవరం నియోజకవర్గంలో లంక గ్రామాలను వరద నీరు చుట్టుముడుతోంది. పి.గన్నవరం మండలం శివాయిలంక, చినకందాల పాలెం, వాడ్రేవుపల్లి, నాగుల్లంక గ్రామాల్లోకి వరదనీరు చేరాయి. అయినవిల్లి లంక కాజ్‌వే పూర్తిగా నీట మునిగిపోవడంతో నాలుగు లంకగ్రామాల ప్రజలు నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. రాత్రి అయినవిల్లి మండలం పొట్టిలంక గ్రామంలో వరద బాధితుల పునరావాస కేంద్రాలను  కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆకస్మిక తనిఖీ చేశారు. 

Updated Date - 2022-07-13T16:43:30+05:30 IST