కృష్ణాజిల్లా: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గుడ్లవల్లేరు మండలంలో నిర్వహించిన భారీ ర్యాలీలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఫోటోలను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రానికి దశ, దిశ నిర్దేశించే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ సభ్యుల అకృత్యాలు ప్రజలకు తెలియకుడదనే అసెంబ్లీ సమావేశాల ప్రసారాలు నిలిపి వేశారన్నారు. ప్రజలు చెప్పులతో కొట్టే స్థితికి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దిగజారారని కొనకళ్ల నారాయణరావు అన్నారు.