Abn logo
May 22 2020 @ 22:12PM

అలా కాని పక్షంలో ఓటీటీలో ‘నిశ్శ‌బ్దం’: కోన వెంకట్

‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘నిశ్శ‌బ్దం’. అన్ని బాగుంటే ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుదలయ్యేది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో ఈ చిత్ర రిలీజ్ ఆగిపోయింది. ఇప్పుడీ చిత్ర విడుదలపై అనేకానేక వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారనే వార్తలు రావడం, వెంటనే చిత్రయూనిట్ రెస్పాండై అలాంటిదేమీ లేదని చెబుతుండటం.. ఇలా ప్రతిరోజూ ఈ సినిమాపై వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన కోన వెంకట్ ఈ చిత్ర విడుదలపై క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు.


‘‘మా చిత్రం ‘నిశ్శ‌బ్దం’ విషయంలో మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసేందుకే మేము అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. చాలా కాలం పాటు అందుకు పరిస్థితులు అనుకూలించకపోతే మాత్రం.. అప్పుడు ఓటీటీ గురించి ఆలోచిస్తాము. అప్పుడు అదే బెస్ట్ అని అనుకుంటాము..’’ అని కోన వెంకట్ తన ట్వీట్‌లో తెలిపారు. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని.. క్రితి ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ అసోసియేషన్‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మాణతలో టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ నిర్మించారు.


Advertisement
Advertisement
Advertisement