ఓ ఇంటివాడైన శ్రీకర్‌ భరత్‌

ABN , First Publish Date - 2020-08-07T09:46:26+05:30 IST

భారత క్రికెటర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ వివాహం బుధవారం రాత్రి ఇక్కడి ఓ స్టార్‌ హోటల్లో జరిగింది. నగరంలోని గాజువాక ప్రాంతానికి చెందిన అంజలితో అత్యంత ...

ఓ ఇంటివాడైన శ్రీకర్‌ భరత్‌

విశాఖపట్నం (స్పోర్ట్స్‌): భారత క్రికెటర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ వివాహం బుధవారం రాత్రి ఇక్కడి ఓ స్టార్‌ హోటల్లో జరిగింది. నగరంలోని గాజువాక ప్రాంతానికి చెందిన అంజలితో అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది. టీమిండియా ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, జడేజా, ఇషాంత్‌, షమీ, మయాంక్‌ అగర్వాల్‌, పుజారా, మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రావిడ్‌ ఫోన్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది నవంబరులో కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌ జరిగిన టెస్టు మ్యాచ్‌కు అనూహ్యంగా టీమిండియా జట్టులో చేరిన శ్రీకర్‌ భరత్‌....రంజీ ట్రోఫీలో ఆంధ్ర తరపున తొలి ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు  78 ఫస్ట్‌క్లాసు మ్యాచ్‌ల్లో 4283 పరుగులు సాధించాడు. 

Updated Date - 2020-08-07T09:46:26+05:30 IST