కొమురంభీం: జిల్లా ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న పులి కోసం అధికారుల గాలింపు కొనసాగుతోంది. తలాయిపేట బీట్‌లోనే అటవీశాఖ అధికారులు మకాం పెట్టారు. పులిని బంధించేందుకు బోన్లు, మంచెలు, వలలు ఏర్పాటు చేసి.. పులి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. మహారాష్ట్ర నిపుణులు, షూటర్లు, వైద్యులు పులిని బంధించేందుకు రంగంలోకి దిగారు. కంది భీమన్న అటవీ ప్రాంతంలో 80 మంది ప్రత్యేక సిబ్బందిని నియమించారు. పులి కనిపిస్తే మత్తు మందు ప్రయోగించేలా ఏర్పాట్లు చేశారు.