Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 16 Apr 2022 17:59:14 IST

‘RRR’: 4కె క్వాలిటీలో ‘కొమ్మ ఉయ్యాలా’ వీడియో సాంగ్

twitter-iconwatsapp-iconfb-icon

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. త్వరలో మరికొన్ని దేశాల్లోనూ రికార్డులు నమోదు చేయడానికి రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘నాటు నాటు’ ఫుల్ వీడియో సాంగ్‌ రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌ని షేక్ చేస్తుంటే.. ఇప్పుడు మరో సాంగ్‌ని మేకర్స్ వదిలారు. థియేటర్స్‌లో ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చిన ‘కొమ్మ ఉయ్యాలా’ అనే ఎమోషనల్ సాంగ్‌ను శనివారం ఐదు భాషలలో విడుదల చేశారు. 4కె క్వాలిటీతో వచ్చిన ఈ సాంగ్.. ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సుద్దాల అశోక్ తేజ రచించిన ఈ సాంగ్‌ని ప్రకృతి రెడ్డి ఆలపించారు. ఎమ్.ఎమ్. కీరవాణి స్వరపరచారు. ఈ పాటలో కొమరం భీమ్ గెటప్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భుజాలపై మల్లిని ఎత్తుకొని వెళ్లే సన్నివేశాలు ప్రేక్షకుల మనసులని హత్తుకుంటాయి. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement