నేను, రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాం: కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2022-02-15T21:45:50+05:30 IST

నేను, రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాం: కోమటిరెడ్డి

నేను, రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాం: కోమటిరెడ్డి

హైదరాబాద్: పార్టీ అంతర్గత విషయాలపై చర్చించామని, భవిష్యత్ లో ఏం చేయాలనేదానిపై కూడా చర్చించామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ లో నిరుద్యోగుల ఆత్మహత్యలు రోజు వింటుంన్నాం.. ఇప్పుడు మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని, రైతులు తక్కువ ధరకు అమ్ముకుంటే.. మధ్యవర్తుల దగ్గర అధిక ధరకు ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఓక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పారు. సిద్దిపేట, గజ్వేల్‌లో ఉన్న వారే ప్రజలా? తమ నియజకవ్గాలకు డబుల్ బెడ్ రూమ్‌లు ఎందుకు ఇవ్వరు? అని ఆయన ప్రశ్నించారు. ఎంతో మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చిందన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేయాలని తాను, రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా పోరాటాలు చేస్తుందన్నారు. 

ఇంతవరకు ఓక్క డీఏస్సీ ఇవ్వలేదని, కేసీఆర్ పుట్టినరోజు కానుకగా నిరుద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-15T21:45:50+05:30 IST