స్టార్ క్యాంపెయినర్‌గా నా బాధ్యత ఏంటో చూపిస్తా: కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2022-04-10T22:33:14+05:30 IST

స్టార్ క్యాంపెయినర్‌గా తన బాధ్యత ఏంటో చూపిస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

స్టార్ క్యాంపెయినర్‌గా నా బాధ్యత ఏంటో చూపిస్తా: కోమటిరెడ్డి

హైదరాబాద్: స్టార్ క్యాంపెయినర్‌గా తన బాధ్యత ఏంటో చూపిస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతామని ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. షేక్‌పేటలో రూ.2 వేల కోట్ల ప్రభుత్వ భూమిని.. ప్రైవేట్ కంపెనీకి కట్టబెడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాజకీయాలపై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఫోకస్‌ పెట్టారు. ఈ నేపథ్యంలోనే స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నియామించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని నియమిస్తున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది.

Updated Date - 2022-04-10T22:33:14+05:30 IST