Resignation letter.. సోనియాగాంధీకి రాజీనామా లేఖ పంపిన రాజగోపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-04T21:56:03+05:30 IST

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపించారు.

Resignation letter.. సోనియాగాంధీకి రాజీనామా లేఖ పంపిన రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్ (Hyderabad): కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Raja Gopal Reddy) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ రాజీనామా లేఖను గురువారం ఆయన సోనియాగాంధీ (Sonia Gandhi)కి పంపించారు. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు.. ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే 8వ తేదీకి అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ స్పీకర్‌ (Telangana Speaker)ను కోరారు. ఆ రోజు సభాపతికి రాజీనామా లేక ఇవ్వనున్నట్లు సమాచారం.  


తన నియోజకవర్గమైన మునుగోడు (Munugode) ప్రజలకు మేలు జరుగుతుందనే నమ్మకంతోటే రాజీనామా చేస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. ఉప ఎన్నిక జరిగితేనే నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇస్తుందనే ప్రచారం జరుగుతోందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ (TRS) అరాచకపాలన పోవాలంటే బీజేపీ (BJP) వల్లే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌పై పోరాడలేకపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధతోటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పిన ఆయన... స్పీకర్ అపాయింట్‌మెంట్ తీసుకుని రాజీనామా లేఖను అందజేస్తానని వెల్లడించారు. 

Updated Date - 2022-08-04T21:56:03+05:30 IST