కేసీఆర్‌, కేటీఆర్‌ పెద్ద మోసగాళ్లు

ABN , First Publish Date - 2021-03-01T06:37:27+05:30 IST

కేసీఆర్‌, కేటీఆర్‌ పెద్ద మోసగాళ్లు

కేసీఆర్‌, కేటీఆర్‌ పెద్ద మోసగాళ్లు
బచ్చన్నపేట-బసిరెడ్డిపల్లి రోడ్డును పరిశీలిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఐకేపీ సెంటర్లు తీసేస్తే ఢిల్లీ కంటే పెద్ద ఉద్యమం 

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

బచ్చన్నపేట, ఫిబ్రవరి 28: ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆయన కుమారుడు కేటీఆర్‌ పెద్ద మోసగాళ్లని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం మండలకేంద్రం నుంచి బసిరెడ్డిపల్లి మీదు గా కొడవటూరు, ఆలీంపూర్‌ గ్రామాలకు రూ.5.53 కోట్లతో నిర్మితమవుతున్న బీటీ రోడ్డు పనులను ఎంపీ పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులు చేయాలన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చింతమడకలోనే పేదలున్నట్టు ఇంటికి రూ.10 లక్షలు ఇచ్చాడని, మిగతా ప్రాంతాలలో పేద లు లేరా అని ప్రశ్నించారు. సిద్దిపేటలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కడుతానంటూ ప్రకటించటం సీఎంకు పిచ్చిముదిరిందనటానికి నిదర్శనమన్నారు.అతి తక్కు వ పీఆర్సీతో కేసీఆర్‌ ఉద్యోగులను బిచ్చగాళ్లను చేశా డని, రిటైర్‌మెంట్‌ వయసు పెంచుతానని, నిరుద్యోగ భృతి ఇస్తానని, ఉద్యోగాలకు భర్తీ చేస్తామని మాయమాటలు చెబుతున్నాడని విమర్శించారు. గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం మొత్తం బంగారు తెలంగాణ అయినట్టు కేసీ ఆర్‌ భ్రమ పడుతున్నాడని అన్నారు. 

కాంగ్రెస్‌ హయాంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్‌లను ఎత్తేస్తే ఢిల్లీ కన్నా పెద్ద రైతు ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. పెద్ద ఎత్తున డబ్బులు పంచి, సెల్‌ఫోన్‌లు ఇచ్చి పట్టభద్రుల ఓట్లు కొనాలని టీఆర్‌ఎస్‌ ఎత్తులు వేస్తోందని, వాటిని తీసుకుని తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన రాములు నాయక్‌ ను గెలిపించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నిడిగొండ శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షుడు కోడూరి మహాత్మాచారి, నల్లగోని బాలకిషన్‌గౌడ్‌, కొమ్ము నర్సింగరావు, గిరి కొండల్‌రెడ్డి, క్రాంతికుమార్‌, పుట్ట నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌కే కాళేశ్వరం నీళ్లు

నర్మెట: కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వ్యవసాయానికి నీళ్లు అందించడం కోసమే కాళేశ్వరం, కొండపోచమ్మ, మల్ల న్నసాగర్‌ ప్రాజెక్టులు నిర్మించారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం నర్మె ట మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. జనగా మ, చేర్యాల నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలకు గోదావరి జలాలు వచ్చేలా ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వం డిజైన్‌ చేస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాన్ని మార్చి జనగామ నియోజకవర్గంలోని గ్రామాలకు నీళ్లు ఇవ్వకుండా తపా్‌సపల్లి ద్వారా కొండపాక మండ లం నుంచి సిద్దిపేట జిల్లాకు నీటిని తరలిస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములునాయక్‌ను గెలింపిచాలని కోరారు.

కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జంగి టి అంజయ్య, జిల్లా కార్యదర్శి గంగం నర్సింహారెడ్డి, భూక్య జయరాం, గొల్లపల్లి కుమారస్వామి, వై.సుధాకర్‌, వేమళ్ల సత్యనారాయణరెడ్డి, మద్దూరు జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి, కొమ్ము నర్సింగరావు, గాదె మోహన్‌రెడ్డి, యాట క్రాంతికుమార్‌, సారాబు మధు, కన్నెబోయిన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-01T06:37:27+05:30 IST