హైదరాబాద్: తన రాజీనామా ఆమోదించకపోతే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు కూర్చుంటానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) ప్రకటించారు. సీఎం కేసీఆర్ (CM KCR), కాంగ్రెస్ పార్టీలో అవమానాలకు గురైన నేతలు బీజేపీలో చేరతారని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతాయని జోస్యం చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వెళ్లిపోతే.. సీఎం అయ్యే కల నెరవేరదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైట్ టైంలో తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తాను అమ్ముడుపోయానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి కాంగ్రెస్‌కు లేదని తెలిపారు. తన కోసం కాదు.. తెలంగాణ, మునుగోడు కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. 13 ఏళ్లలో తనపై ఒక్క కేసు కూడా లేదని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.