అందుకే ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన: Komati Reddy

ABN , First Publish Date - 2022-05-22T22:46:21+05:30 IST

9 ఏళ్ల పాటు విస్మరించి..కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ (KCR) సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్‌లకు సాగునీరు అందించే ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన

అందుకే ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన: Komati Reddy

సంగారెడ్డి: 9 ఏళ్ల పాటు విస్మరించి..కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ (KCR) సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్‌లకు సాగునీరు అందించే ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. జహీరాబాద్ మండలం అల్గోల్‌లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయనతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణ‌మాఫీ చేయకపోవడం వల్ల రైతులకు వడ్డీ భారం పెరిగిందన్నారు. ప్రగతి భవన్ నిర్మాణానికి రూ. 1000 కోట్లు, సచివాలయం నిర్మాణానికి రూ.3000 కోట్లు ఖర్చు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు. ఈ డబ్బుతో మూతపడ్డ చక్కెర పరిశ్రమలు తెరిపించొచ్చని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-05-22T22:46:21+05:30 IST