TS News: కుమరం భీం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు

ABN , First Publish Date - 2022-08-08T01:33:14+05:30 IST

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ మండలంలోని కుమరం భీం ప్రాజెక్టు (Komaram Bheem Project)కు ముప్పు పొంచి ఉంది.

TS News: కుమరం భీం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు

ఆసిఫాబాద్‌: కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ మండలంలోని కుమరం భీం ప్రాజెక్టు (Komaram Bheem Project)కు ముప్పు పొంచి ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు జలాశయ కట్టకు పగుళ్లు ఏర్పడమే కాకుండా పారాఫీట్‌ వాల్‌ దెబ్బతింది. దీంతో పగుళ్లతోపాటు రాళ్లు లోపల వైపునకు పడిపోతున్నాయి. దీనికి తోడు పగుళ్లు ఏర్పడిన ప్రాంతం పక్కన తాజాగా శుక్రవారం నుంచి చిన్నగా నీరు లీకేజీ అవుతోంది. ప్రస్తుతం భారీ వర్షాలు (Heavy rains) మొదలు కావడంతో వరదప్రవాహం పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో అనకట్టకు ప్రమాదం జరిగితే పిరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  వర్షకాలం కంటే ముందు నుంచే ఈ ప్రాంతంలో కొంత లీకేజీ ఏర్పడిందని, వర్షాలకు ఎక్కువైనట్లు సమీప గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. ఇటీవల కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2022-08-08T01:33:14+05:30 IST