కీచక SI.. Study material ఇస్తానంటూ.. యువతిపై..

ABN , First Publish Date - 2022-07-12T20:17:06+05:30 IST

హైదరాబాద్, మారేడ్‌పల్లి సీఐ ఘటన మరవకముందే కొమరంభీం జిల్లాలో మరో కీచక ఎస్ఐ భాగోతం బయటపడింది.

కీచక SI.. Study material ఇస్తానంటూ.. యువతిపై..

కొమరం భీం (Komaram Bheem) జిల్లా: తెలంగాణ (Telangana)లో ఖాకీ కీచకులు బయటపడుతున్నారు. హైదరాబాద్ (Hyderabad), మారేడ్‌పల్లి సీఐ (CI) ఘటన మరవకముందే కొమరంభీం జిల్లాలో మరో కీచక ఎస్ఐ (SI) బాగోతం బయటపడింది. పోలీస్ (Police) ఉద్యోగానికి సిద్ధమవుతున్న ఓ యువతికి స్టడీ మెటీరియల్స్ ఇస్తానంటూ రెబ్బెన (Rebbena) ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ (Bhavani Sen Goud) మొదట నమ్మించాడు. ఆ తర్వాత లైంగికంగా వేధించాడు. ఉద్యోగం వచ్చేలా చేస్తానంటూ స్టేషన్‌కు పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. ఎత్తు, బరువు చూడాలంటూ ఆమెకు నరకం చూపించాడు. దీంతో ఆమె ఎదురుతిరగడంతో బెదిరించాడు. బంధువులకు బాధితురాలు జరిగిన విషయం చెప్పడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2022-07-12T20:17:06+05:30 IST