కుమరం భీం జిల్లాలో ఎడతెరిపి లేని వాన

ABN , First Publish Date - 2022-07-05T01:29:37+05:30 IST

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని

కుమరం భీం జిల్లాలో ఎడతెరిపి లేని వాన

ఆసిఫాబాద్‌: కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.  జిల్లాలోని ఆసిఫాబాద్‌, వాంకిడి, కెరమెరి, జైనూరు, సిర్పూర్‌(యూ), లింగాపూర్‌, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి), దహెగాం, కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, పెంచికలపేట మండలాల్లో రెండు రోజులుగా ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులలోకి వరదనీరు భారీగా వచ్చి చేరింది. దీంతో వట్టివాగు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి 2, 162 క్యూసెక్కుల వరద నీటిని కిందికి వదిలారు. అదేవిధంగా కుమరంభీం ప్రాజెక్టులో 475క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది.  వర్షా లకు  కైరిగూడ ఓపెన్‌ కాస్టులో ఉత్పత్తి నిలిచిపోయింది. చింతలమానేపల్లి మండలంలోని దిందావాగు పొంగి ప్రవహిస్తుం డడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బెజ్జూరు మండలం సలుగుపల్లి- సులుగుపల్లి గ్రామాల మధ్య ఉన్న తీగల ఒర్రె ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 


మంచిర్యాల జిల్లాలో..

మంచిర్యాల జిల్లాలో సగటున 49.6 మిల్లీ మీటర్ల వర్షం పడింది. గరిష్టంగా బెల్లంపల్లి మండలంలో 127.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకాగా లక్షెట్టిపేట మండలంలో అత్యల్పంగా 17.9 మీల్లీ మీటర్ల వర్షం కురిసింది. నెన్నెల మండలంలో 93.1 మిల్లీ మీటర్లు, కన్నెపల్లి మండలంలో 76.6 మి.మీ., వేమనపల్లి మండలంలో 76.0 మి.మీ., తాండూరు మండలంలో 51.0 మి.మీ., మంచిర్యాల మండలంలో 47.6 మి.మీ., నస్పూర్‌ మండలంలో 42.8 మి.మీ., కాసిపేట మండలంలో 42.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.


రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం సరాసరి 43.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సిరిసిల్లలో 60.1 మిల్లీమీటర్లు, అత్యల్పంగా కోనరావుపేట మండలంలో 25.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో 58.8, గంభీరావుపేట 56.6, తంగళ్లపల్లి 49.3,  బోయినపల్లి 47.1,  వేములవాడ రూరల్‌ 45.7, ముస్తాబాద్‌ మండలంలో 45.1, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  

Updated Date - 2022-07-05T01:29:37+05:30 IST